మళ్లీ దొరికేసావ్ భయ్యా.. తమన్ పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్న నెటిజన్లు..

Netizens Trolling Thaman About Jai Balayya Song
x

మళ్లీ దొరికేసావ్ భయ్యా.. తమన్ పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్న నెటిజన్లు..

Highlights

Jai Balayya Song: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతాన్ని అందించారు.

Jai Balayya Song: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతాన్ని అందించారు. ఎందరో స్టార్ హీరోలకు చార్ట్ బస్టర్ పాటలను అందించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో లో ఉన్న బిజీ మ్యూజిక్ డైరెక్టర్ లలో తమన్ పేరు ముందే ఉంటుంది. తన చేతిలో ఇప్పుడు డజన్ల కొద్దీ పెద్ద సినిమాలున్నాయి. అయితే అభిమానులతో పాటు తమన్ సంగీతంపై ట్రోల్స్ కూడా పెరుగుతూనే వస్తున్నాయి. తమన్ పాటలు అన్నీ ఏదో ఒక పాట కాపీ అంటూ నెట్టింట్లో చాలా మంది కామెంట్ల వర్షం కురిపిస్తూ ఉంటారు.

తమన్ నుంచి ఏ పాట వచ్చినా అది ఎక్కడో విన్నట్టు ఉంది కదూ అంటూ కామెంట్లు మొదలైపోతాయి. ఆ ఒరిజినల్ పాట గురించి రీసెర్చ్ చేసి మరీ కంపార్ చేస్తూ ట్రోల్స్ పుట్టిస్తారు కొందరు. తాజాగా అదే మళ్ళీ జరిగింది. రీసెంట్ గా తమన్ కంపొజిషన్ చేసిన "జై బాలయ్య" పాట "వీరసింహారెడ్డి" సినిమా నుండి విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో బాగానే ట్రెండ్ అవుతోంది. అయితే ఈ పాటలోని లిరిక్స్ తర్వాత వచ్చే "జై బాలయ్య జై జై బాలయ్య" అనేది "రాములమ్మ" సినిమాలోని పాట లాగా ఉందని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో "మళ్లీ దొరికేసావ్ భయ్యా" అంటూ హేటర్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories