"లైగర్" భామపై నిప్పులు చెరుగుతున్న అభిమానులు

Ananya Panday: యువ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఇప్పుడు "లైగర్" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

Arun Chilukuri
Published on: 21 Aug 2022 3:29 PM IST
Netizens Trolled Ananya Panday
X

"లైగర్" భామపై నిప్పులు చెరుగుతున్న అభిమానులు

Ananya Panday: యువ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఇప్పుడు "లైగర్" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 25న థియేటర్లలో విడుదల కాబోతోంది. అయితే తాజాగా సినిమా ప్రమోషన్స్ తో చిత్ర బృందం చాలా బిజీగా ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనన్య చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నెటిజన్లు అనన్య పాండేని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇండియన్ సినిమాకు టైగర్ ఎవరు, లయన్ ఎవరు అని ప్రశ్నించగా, విజయ్ దేవరకొండ మెగాస్టార్ చిరంజీవి మరియు రజనీకాంత్ అని అన్నారు. రమ్యకృష్ణ మాత్రం అమితాబ్ బచ్చన్ మరియు రజనీకాంత్ అని చెప్పింది. కానీ అనన్య పాండే మాత్రం సల్మాన్ ఖాన్ మరియు షారుఖ్ ఖాన్ ఇండియన్ సినిమా కి టైగర్ మరియు లయన్ లాంటి వారు అంటూ సమాధానం చెప్పి షాక్ ఇచ్చింది.

ఇప్పటికే ఖాన్ లపై దేశ వ్యాప్తంగా నిరసన లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో అనన్య పాండే చేసిన కామెంట్లు ఈమెకు రివర్స్ అయ్యాయి. అనన్య పాండేకి తెలుగులో ఇది మొదటి సినిమా. కానీ కనీసం సినిమా విడుదల కూడా అవ్వకముందే ఆమెకి ప్రేక్షకుల నుంచి ఇంత నెగెటివిటీ రావటం ఆమె టాలీవుడ్ కెరీర్ కి అంతగా మంచిది కాదని ఇకనైనా ఆమె జాగ్రత్తగా ఉంటే మంచిదని ఇండస్ట్రీ పెద్దలు చెబుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story