హీరో సిద్ధార్థ్ ట్వీట్ పై చెలరేగిన దుమారం.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై అభ్యంతరకర ట్వీట్లు

Siddharth: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్లు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.

Arun Chilukuri
Published on: 10 Jan 2022 3:39 PM IST
Netizens Troll Actor Siddharth After his Tweet on Saina Nehwal
X

హీరో సిద్ధార్థ్ ట్వీట్ పై చెలరేగిన దుమారం.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై అభ్యంతరకర ట్వీట్లు

Siddharth: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్లు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ప్రధాని భద్రతా వైఫల్యంపై సైనా నెహ్వాల్ స్పందిస్తూ చేసిన ట్వీట్ పై సిద్ధార్థ్ అసభ్య పదజాలంతో చెలరేగాడు. ప్రధానంగా మోడీ వ్యతిరేకి అయిన సిద్ధార్థ్ బ్యాడ్మింటన్ క్రీడలో పదజాలాన్ని వాడుతూ సైనాపై బాహాటంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీనిపై మహిళా సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఇంత మర్యాద, సంస్కారం తెలియని వ్యక్తి ట్విటర్ ఎక్కౌంట్ ఇంకా ఎందుకు బ్లాక్ చేయలేదని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సిద్ధార్ధ్ పై కేసు నమోదు చేయాలని అటు జాతీయ మహిళా కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది. సింగర్ చిన్మయి కూడా సిద్ధార్ధ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఘాటు కౌంటర్ ఇచ్చింది. అయితే తాను చేసిన వ్యాఖ్యలకు డబుల్ మీనింగ్ తీయొద్దంటూ సిద్ధార్ధ్ కౌంటర్ ట్వీట్ చేశాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story