Puneeth Rajkumar: పవర్ స్టార్ బయోపిక్ కావాలి అంటున్న నెటిజన్లు

*స్టార్ హీరో బయోపిక్ అడుగుతున్న నెటిజన్లు

admin1
Updated on: 24 Nov 2021 1:30 PM IST
Netizens Requested to do Biopic Movie of Power Star Puneeth Rajkumar
X

పవర్ స్టార్ బయోపిక్ కావాలి అంటున్న నెటిజన్లు

Puneeth Rajkumar: కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్ రాజ్‌ కుమార్‌ మరణ వార్త ఆయన కుటుంబాన్ని మరియు అభిమానులను కలచివేసింది. అక్టోబర్‌ 29న హార్ట్‌ ఎటాక్‌ తో పునీత్ తుది శ్వాస విడిచిన విషయం మనకి తెలిసిందే. కన్నడ సినీ ఇండస్ట్రీ పునీత్ మరణంతో శోక సంద్రంలో మునిగిపోయింది. ఇక పునీత్‌ లేరనే నిజాన్ని ఇప్పటికీ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. నటుడిగా మాత్రమే కాక కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి సహాయం చేసిన పునీత్‌ అభిమానుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఒక అభిమాని పునీత్ రాజ్‌ కుమార్‌ బయోపిక్‌ తీయచ్చు కదా అని ట్వీట్ చేశారు. ఇలా ప్రశ్నిస్తూ సంతోష్‌ ఆనందారం అనే దర్శకుడిని కూడా ఆ ఫ్యాన్‌ ట్యాగ్‌ చేశాడు. "సర్‌.. ప్లీజ్‌ అప్పు(పునీత్‌) సర్‌ మీద ఓ బయోపిక్‌ తీయండి. అప్పును దగ్గరి నుంచి చూశారు. ఆయన ప్రేమ, నైతిక విలువల గురించి మీకు చాలా విషయాలు తెలుసు. మీరు దయచేసి అప్పు సర్‌ జీవితాన్ని తెర మీద చూపించండి' అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్‌కు బదులిచ్చిన సంతోష్‌. "అప్పు సర్‌ ఎప్పటికీ జీవించే ఉంటారు. అయినప్పటికీ ఆయన జీవితాన్ని వెండితెరమీద చూపించేందుకు నా వంతు ప్రయత్నం నేను చేస్తాను" అని బదులు ఇచ్చారు. దీంతో పునీత్ బయోపిక్‌ వార్త సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

admin1

admin1

Next Story