చిరంజీవి చెప్పినట్లు కేస్ స్టడీ అయ్యేంత సీన్ లేదు అంటున్న నెటిజన్లు

Netizens Reacted to Chiranjeevi Comments
x

చిరంజీవి చెప్పినట్లు కేస్ స్టడీ అయ్యేంత సీన్ లేదు అంటున్న నెటిజన్లు

Highlights

*చిరంజీవి కామెంట్లపై రియాక్ట్ అయిన నెటిజన్లు

Chiranjeevi: భారీ అంచనాల మధ్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో నటించిన "వాల్తేరు వీరయ్య" సినిమా సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సినిమా లో చిరంజీవి మరియు రవితేజల నటన హైలైట్ అని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ చిత్ర సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్ర బృందం. దీనిలో భాగంగా మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

డైరెక్టర్ బాబి ఈ సినిమాని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని ఇండస్ట్రీలోకి రాబోతున్న యువ డైరెక్టర్లకు కూడా ఈ సినిమా ఒక కేస్ స్టడీ అని చెప్పుకొచ్చారు చిరంజీవి. అయితే చిరంజీవి కామెంట్ లను నెటిజన్లు అంగీకరించటం లేదు. వాల్తేరు వీరయ్య సినిమా అంతా గొప్పగా ఏమీ లేదని సినిమాలో అసలు చెప్పుకోదగ్గ కథ కూడా లేదని సినిమా కేవలం ఒక రొటీన్ ఫార్ములా తో నడిచే మాస్ మసాలా కమర్షియల్ సినిమా అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఇక చిరంజీవి గనుక లేకపోతే ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యుండేదని చెబుతున్నారు. ఒకవైపు లోకేష్ కనగరాజ్ కార్తీక్ సుబ్బరాజ్ వంటి యువ డైరెక్టర్లు మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వస్తుంటే చిరంజీవి ఇలాంటి కమర్షియల్ సినిమాలను చేస్తూ మళ్ళీ వాటినే ఇలా పొగడటం ఏ మాత్రం బాగాలేదని కొందరు చెబుతున్నారు. ఇలాంటి కథ లేని కమర్షియల్ సినిమాలను కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను కేస్ స్టడీలుగా తీసుకోవాలని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories