Rashmika Mandanna: నువ్విలా చేస్తావనుకోలేదు అని వాపోతున్న రష్మీక ఫ్యాన్స్

* ఇలాంటి చీప్ యడ్స్ ను రష్మీక నుండి వస్తాయి అనుకోలేదు అంటూ కొందరు ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు

admin1
Published on: 29 Sept 2021 12:58 PM IST
Netizens Fires on Rashmika Over Macho Brand add
X

Rashmika Mandanna: నువ్విలా చేస్తావనుకోలేదు అని వాపోతున్న రష్మీక ఫ్యాన్స్

Rashmika Mandanna: కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇప్పుడు తెలుగులో మాత్రమే కాక అటు తమిళం మరియు హిందీ భాషలలో కూడా వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతోంది. ఒకవైపు సినిమాలు మాత్రమే కాక మరో వైపు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ తో కూడా రష్మిక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మధ్యనే "ఛలో" బ్యూటీ మగవాళ్ళ లోదుస్తుల బ్రాండ్ అయినా "మ్యాచో" యాడ్ లో విక్కీ కౌశల్ తో నటించింది. ఈ యాడ్ లో భాగంగా రష్మిక విక్కీ కౌశల్ అండర్ వేర్ స్ట్రాప్ నీ చూస్తూ ఉంటుంది.

ఇప్పుడు ఈ యాడ్స్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ యాడ్ చాలా రాంగ్ గా ఉంది అంటూ కొందరు ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఇలాంటి చీప్ యడ్స్ రష్మీక నుండి వస్తాయి అనుకోలేదు అంటూ కొందరు ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలు అండర్ వేర్ బ్రాండ్లు, పెర్ఫ్యూమ్ బ్రాండ్లు ఇలా చీప్ యాడ్స్ చేస్తున్నాయి అని నెటిజన్లు ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. కానీ నెటిజన్లు ఎంత ఫైర్ అవుతున్నప్పటికీ మళ్లీ రష్మీక కూడా ఇలాంటి యాడ్ లో కనిపించడం అందరినీ నిరాశ పరిచింది. ఈ అండర్ వేర్ బ్రాండ్ మాత్రం ఈ వివాదాలపై ఇంకా రీయాక్ట్ అవ్వాల్సి ఉంది.

admin1

admin1

Next Story