రాజమౌళి పై ఫైర్ అవుతున్న నెటిజన్లు

రాజమౌళి పై ఫైర్ అవుతున్న నెటిజన్లు

admin1
Updated on: 16 March 2022 1:00 PM IST
Netizens Fire on Rajamouli | Tollywood News
X

రాజమౌళి పై ఫైర్ అవుతున్న నెటిజన్లు

Netizens Fire on Rajamouli: కరోనా కారణంగా వాయిదా పడ్డ సినిమాలు అన్ని ఇప్పుడు మళ్లీ విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "ఆర్ ఆర్ ఆర్" సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఎంత పెద్ద సినిమా అయినా కనీసం బ్రేక్ ఈవెన్ పాయింట్ ను చేరుకోవడం కూడా గగనమై పోతోంది. పైగా రాధేశ్యామ్ వంటి పెద్ద సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో డిస్ట్రిబ్యూటర్లు భారీగానే నష్టపోతున్నారు.

ఈ నేపథ్యంలో "ఆర్ఆర్ఆర్" చిత్ర దర్శక నిర్మాతలు కూడా కొంచెం కంగారు పడుతున్నారు. ఇండస్ట్రీలోని మరికొందరు పెద్దలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి టికెట్ రేట్ల పెంపు గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో మాట్లాడారు కానీ ఎలాంటి ఉపయోగం లేకపోయింది. మరోవైపు తెలంగాణలో టికెట్ రేట్లు ఎక్కువ చేద్దామనే ఆలోచన కి నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి వాటిని మరికొంచెం పెంచితే ఎట్లా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక మరో 10 రోజుల్లో సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికైనా సినిమా టికెట్ రేట్ల కంటే ప్రమోషన్లపై ఫోకస్ చేయమని అభిమానులు కూడా చెబుతున్నారు.

admin1

admin1

Next Story