ఆర్ఆర్ఆర్ టీజర్ పై నెటిజన్ల విమర్శలు

ఆర్ఆర్ఆర్ టీజర్ పై నెటిజన్ల విమర్శలు
x
Highlights

నెటిజన్స్ కు అడ్డంగా బుక్ అయ్యాడు స్టార్ డైరెక్టర్ రాజమౌళి. కొమరం భీమ్ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ పై నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు....

నెటిజన్స్ కు అడ్డంగా బుక్ అయ్యాడు స్టార్ డైరెక్టర్ రాజమౌళి. కొమరం భీమ్ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ పై నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్టీఆర్ ముస్లీం గెటప్ ఇప్పుడు వివాదం అవుతుంది. కల్పిత కథ అయిన కొమరం భీమ్ పేరుతో వస్తుంది కాబట్టి భవిష్యత్ లో సినిమాకు ఇబ్బందులు తప్పేలా లేదు.

కొమరం భీమ్ జయంతి సందర్భంగా రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ టీజర్ పై అన్ని వర్గాల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కొమరం భీమ్ నిజాం పాలనకి, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారని, ఆయన కూతుర్ని అప్పటి ముస్లిం పాలకులు కొంతమంది ఇబ్బంది పెట్టారని చారిత్రక ఆధారాలున్నాయి. అలాంటి చరిత్ర ఉన్న భీమ్ ని టీజర్ చివర్లో ముస్లిం గెటప్ లో చూపించడం నెటిజన్స్ కు నచ్చలేదు.

మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ సీబీఐ డైరెక్టర్ నాగేశ్వరరావు కూడా తన ట్విట్టర్లో రాజమౌళిని సున్నితంగా విమర్శించారు. చరిత్రను వక్రీకరించే హక్కు, అధికారం ఎవరిచ్చారని ఇలాంటి వాటి వల్ల విశ్వసనీయత పొతుందన్నారు. ఇక నెటిజన్స్ తో పాటు ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్ కూడ టీజర్ పై అసంతృప్తి వ్యక్తం చేసారు. భీమ్ ఫర్ రామరాజు బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో రామరాజు ఫర్ భీమ్ టీజర్ ని ఎడిట్ చేసి పెట్టిన ఫ్యాన్ మేడ్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అసలు టీజర్ కంటే దీనికే ఎక్కువ లైకులు, షేర్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories