ప్రశాంత్ నీల్ మనవాడే అంటున్న తెలుగు ప్రేక్షకులు

ప్రశాంత్ నీల్ మనవాడే అంటున్న తెలుగు ప్రేక్షకులు

Rama Rao
Published on: 28 April 2022 11:39 AM IST
Netizens Comments on Prashanth Neel
X

ప్రశాంత్ నీల్ మనవాడే అంటున్న తెలుగు ప్రేక్షకులు

Prashant Neel: ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు చేసిన తెలుగు సినిమా "ఆర్ఆర్ఆర్" తెలుగు ప్రేక్షకులను కాలర్ ఎగరేసుకునేలా చేసింది. అయితే తాజాగా విడుదలైన "కే జి ఎఫ్ చాప్టర్ 2" మాత్రం హిందీలో ఇంకా ఎక్కువ కలెక్షన్లు చేయడంతో అభిమానులు ప్రశాంత్ నీల్ బ్యాగ్రౌండ్ పైన ఒక కన్నేశారు. తాజా సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ ఒక తెలుగు రెడ్డి అబ్బాయి అని, మాజీ మినిస్టర్ మేనల్లుడు అని కనుక్కున్నారు.

ఒక ప్రముఖ మీడియా ఛానల్ వారు ప్రశాంత్ నీల్ మనోడే అంటూ న్యూస్ కూడా పబ్లిష్ చేశారు. ప్రశాంత్ నీల్ అసలు పేరు ప్రశాంత్ రెడ్డి నీలకంటాపురం అని సమాచారం.అంతేకాకుండా అతను ప్రముఖ కాంగ్రెస్ లీడర్ మరియు మాజీ మినిస్టర్ అయిన ఎన్.రఘువీరారెడ్డి మేనల్లుడు అని వార్తలు వినిపించాయి. ప్రశాంత్ ఇంటిపేరు, రఘువీరా రెడ్డి ఇంటి పేరు ఒకటే అవడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి.

ఏదేమైనా కే జి ఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసింది కూడా మన తెలుగు అబ్బాయి అని కొందరు నెటిజన్లు సంతోషిస్తుండగా కన్నడ ప్రేక్షకులు మాత్రం ప్రశాంత్ పుట్టి పెరిగింది బెంగళూరు లో కాబట్టి తను పూర్తి కన్నడ అబ్బాయి అని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story