రాజమౌళిని డామినేట్ చేయాలనే మణిరత్నం ప్రయత్నమా?

Netizens Comments about Mani Ratnams Dream Project Ponniyin Selvan
x

రాజమౌళిని డామినేట్ చేయాలనే మణిరత్నం ప్రయత్నమా?

Highlights

*రాజమౌళిని డామినేట్ చేయాలనే మణిరత్నం ప్రయత్నమా?

Mani Ratnam Dream Project: ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం తాజాగా ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ "పొన్నియిన్ సెల్వన్" మొదటి భాగంతో బిజీగా ఉన్నారు. సౌత్ లో ఉన్న స్టార్ నటీనటులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా టీజర్ ను ఈమధ్యన విడుదల చేశారు దర్శకనిర్మాతలు. అయితే ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. తమిళ్ నుండి వచ్చే భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ సినిమాగా తమిళ్ ప్రేక్షకులు సినిమాకి బాగానే హైప్ ఇస్తున్నారు.

కానీ మిగతా ప్రేక్షకులకు మాత్రం సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. పైగా మణిరత్నం అంతమంది స్టార్లతో భారీ బడ్జెట్ సినిమా చేసే ఫామ్ లో లేరని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే తాజాగా కొందరు నెటిజన్లు మణిరత్నం కేవలం రాజమౌళిని డామినేట్ చేయాలని మాత్రమే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో రాజమౌళి పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాగానే వినిపిస్తోంది.

అందుకే "పోన్నియిన్ సెల్వన్" తో రాజమౌళి రికార్డులను బద్దలు కొట్టాలని ఆశపడుతున్నారు. అయితే అసలు విజువల్ ఎఫెక్ట్స్, యుద్ధ సన్నివేశాల కొరియోగ్రఫీ ఇతరత్రా విషయాల్లో మణి రత్నం తీసే సినిమా రాజమౌళి సినిమాలతో పోటీ కాదని మరి కొందరు చెబుతున్నారు. ఏదేమైనా కల్కి ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా మొదటి భాగం వివిధ భాషల్లో సెప్టెంబర్ 30న విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories