Allu Arjun: మళ్లీ వివాదాల్లో ఇరుక్కున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

Allu Arjun: అల్లు అర్జున్ ట్వీట్ పై మండిపడుతున్న నెటిజన్లు

Jyothi
Updated on: 12 Sept 2022 10:15 AM IST
Netizens Are Fire Over Allu Arjun Tweet
X

Allu Arjun: మళ్లీ వివాదాల్లో ఇరుక్కున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 

Allu Arjun: ఒకవైపు ఇండస్ట్రీ మొత్తం రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆకస్మిక మరణంతో దుఖః సాగరంలో మునిగిపోయి ఉండగా మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం సెలబ్రేషన్ పోస్టుతో అందరికీ షాక్ ఇచ్చారు. "పుష్ప: ది రైజ్" సినిమాకి గాను సైమా 2022లో అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డు సొంతం చేసుకున్నారు. బన్నీ తో పాటు అల్లు అర్జున్ అభిమానులు కూడా ఈ విషయమై సంతోషంగానే ఉన్నారు. కానీ దీని గురించిన సెలబ్రేషన్స్ చేసుకునే సమయం ఇది కాదు అంటూ కొందరు అల్లు అర్జున్ పై మండిపడుతున్నారు. కృష్ణంరాజు మీద ఏమాత్రం గౌరవం లేదా అని నిప్పులు చెరుగుతున్నారు.

కృష్ణంరాజు మరణ వార్త ఇండస్ట్రీని కుదిపివేసింది. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి వంటి వారు కూడా కృష్ణం రాజు మరణానికి సంతాపాన్ని తెలియజేస్తున్నారు. చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా కృష్ణంరాజుకు నివాళులు అర్పించారు. ఒకవైపు కృష్ణంరాజు మరణానికి సంతాపాన్ని ప్రకటించకుండానే అల్లు అర్జున్ సైమా అవార్డును గెలుచుకున్నట్లుగా ట్విట్టర్లో బ్యాడ్ టైం లో పోస్ట్ చేయడంతో అభిమానులు అల్లు అర్జున్ ట్రోల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పు లేదని కానీ దానికి ఇది మంచి సమయం కాదని కొందరు చెబుతున్నారు.

Jyothi

Jyothi

Next Story