లిప్ లాక్ లు రాశి ఖన్నా కి వర్కౌట్ అవ్వట్లేదా?

లిప్ లాక్ లు రాశి ఖన్నా కి వర్కౌట్ అవ్వట్లేదా?

Rama Rao
Updated on: 24 July 2022 3:31 PM IST
Netizens are commenting that Rashi Khannas Lip Locks do Not Work Out at All
X

లిప్ లాక్ లు రాశి ఖన్నా కి వర్కౌట్ అవ్వట్లేదా? 

Rashi Khanna: "ఊహలు గుసగుసలాడే" సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన టాలెంటెడ్ బ్యూటీ రాశి ఖన్నా. తన అందం మరియు అభినయంతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ కరియర్లో ముందుకు దూసుకు వెళుతోంది. ఈమె హీరోయిన్ గా నటించిన "తొలిప్రేమ"కూడా సినిమాలో హీరో వరుణ్ తేజ్ తో ముద్దు సన్నివేశంలో కూడా నటించింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

కానీ ఆ సినిమా తర్వాత లిప్ లాక్ లు రాశి ఖన్నా కి ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు. "తొలిప్రేమ" సినిమా తర్వాత మళ్లీ అదే లిప్ లాక్ సెంటిమెంట్ ని రాశి ఖన్నా మరికొన్ని సినిమాల్లో ట్రై చేసింది కానీ అన్నీ బెడిసి కొట్టాయి. "జిల్" సినిమాలో గోపీచంద్ తో, "వరల్డ్ ఫేమస్ లవర్" సినిమాలో విజయ్ దేవరకొండ తో, "బెంగాల్ టైగర్" సినిమాలో రవితేజ తో, "బ్రహ్మం" సినిమాలో పృథ్వీరాజ్ తో రాశిఖన్నా లిప్ లాక్స్ సన్నివేశాలలో నటించింది.

కానీ అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. తాజాగా నాగచైతన్య హీరోగా నటించిన "థాంక్యూ" సినిమాలో కూడా రాశి ఖన్నా లిప్ లాక్ సన్నివేశాలలో నటించింది. సినిమా మొదటి పాట లోనే వీరిద్దరూ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించారు. కానీ ఈ సినిమా కూడా విడుదలైన మొదటి రోజు నుంచి డిజాస్ట్రస్ టాక్ తో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో రాశి ఖన్నా కి లిప్ లాక్ లు ఏమాత్రం వర్కౌట్ అవ్వట్లేదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story