దిల్ రాజు పై మండిపడుతున్న నెటిజన్లు

దిల్ రాజు పై మండి పడ్తున్న నెటిజన్లు
Netizens: *పెద్ద సినిమాలకి అదే స్ట్రాటజీ వాడుతున్న దిల్ రాజు
Netizens: ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ నిర్మాతలలో లేక డిస్ట్రిబ్యూటర్ల లో దిల్ రాజు పేరు ముందే ఉంటుంది. నైజాం ఏరియాలో దిల్ రాజు కి తిరుగులేదు. ఇప్పటికే దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసిన చాలా సినిమాలు నైజం ఏరియాల్లో బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఆఖరికి నిన్న గాక మొన్న విడుదలైన "ఆర్ ఆర్ ఆర్" సినిమా కూడా నైజాం ఏరియాలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే నైజాం ఏరియాలో భారీ కలెక్షన్లు నమోదు చేయడానికి దిల్ రాజు వాడే ఒక స్ట్రాటజీ ఉంది. అదే టికెట్ రేట్ల పెంపు. మిగతా అన్ని చోట్లా "ఆర్ఆర్ఆర్" సినిమా టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సెంటర్లలో కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి.
అయినా సరే దిల్ రాజు మాత్రం నైజాం ఏరియాలో పెద్ద సినిమాల టికెట్ రేటు తగ్గించడానికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఆఖరికి ఈ మధ్యనే విడుదలైన డబ్బింగ్ సినిమా "బీస్ట్" కి కూడా భారీ రేట్లు ఫిక్స్ చేశారు థియేటర్ ఓనర్ లు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తమిళనాడు కంటే హైదరాబాద్ లోనే సినిమా టికెట్ రెట్ ఎక్కువ. ఇక ఇవాళ విడుదలైన కే జి ఎఫ్ చాప్టర్ 2 విషయంలో కూడా అదే స్ట్రాటజీ రిపీట్ చేస్తున్నారు దిల్ రాజు. "ఆర్ ఆర్ ఆర్" రేంజ్ లో టికెట్ రేట్లను భారీగా పెంచేశారు. దీంతో నెటిజన్లు దిల్ రాజు పై మండిపడుతున్నారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
కాంగ్రెస్‌లో ఆపరేషన్ మునుగోడు ప్రారంభం
13 Aug 2022 2:32 AM GMTఅక్కపై తమ్ముడి విలువైన ప్రేమ
13 Aug 2022 2:04 AM GMTమునుగోడుపై బీజేపీ యాక్షన్ ప్లాన్
13 Aug 2022 1:47 AM GMTతిరుమలలో వైభవంగా పున్నమి గరుడసేవ
13 Aug 2022 1:27 AM GMTమునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMT