మోహన్ బాబుని ట్రోల్ చేస్తున్న సాయిబాబా భక్తులు

Mohan Babu Sai Baba Temple: సీనియర్ హీరో మోహన్ బాబు తాజాగా ఇప్పుడు ఒక పెద్ద వివాదంలోనే ఇరుక్కున్నారు.

Arun Chilukuri
Updated on: 10 Aug 2022 8:46 PM IST
Netizen Trolls Mohan Babu Comments on Shiridi Sai Baba
X

మోహన్ బాబుని ట్రోల్ చేస్తున్న సాయిబాబా భక్తులు

Mohan Babu Sai Baba Temple: సీనియర్ హీరో మోహన్ బాబు తాజాగా ఇప్పుడు ఒక పెద్ద వివాదంలోనే ఇరుక్కున్నారు. షిరిడీ సాయిబాబా గుడి మీద మోహన్ బాబు చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవి సాయిబాబా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండటంతో వారు మోహన్ బాబుని సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారు.

రంగంపేట లో సాయిబాబా గుడి కట్టించడంలో ఆర్థికంగా సహాయం చేసిన మోహన్ బాబు ఆ గుడి చాలా అందమైన వైబ్ ఇస్తోంది అని చెప్పుకొచ్చారు. ఆ వేడుకలో మాట్లాడుతూ సౌత్ ఇండియాలోనే ఇది అతి పెద్ద సాయిబాబా గుడి అని ఇక భక్తులు షిరిడీకి వెళ్లాల్సిన అవసరమే లేదని అన్నారు. అంతేకాకుండా ఈ గుడి నిర్మాణం విషయంలో మంచు విష్ణు కూడా ల్యాండ్ స్కేప్ విషయంలో చాలా రికమండేషన్స్ చేశారని అవి చాలా బాగా వచ్చాయని అన్నారు.

అయితే షిరిడీ చాలా పవిత్రమైన ప్రదేశమని సాయిబాబా అసలైన గుడి అక్కడే ఉందని అంటున్న భక్తులు మోహన్ బాబు అలాంటి అనవసరమైన కామెంట్లు చేయకుండా ఉండి ఉంటే చాలా బాగుండేదని అంటున్నారు. నిజానికి మోహన్ బాబు కూడా సాయిబాబా భక్తుడే. కాబట్టి మిగతా సాయిబాబా భక్తుల మనోభావాలను దెబ్బతీయాలని అనుకొని ఉండకపోవచ్చు కానీ మోహన్ బాబు అన్న చిన్న మాట ఇప్పుడు వివాదంగా మారింది.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story