Aha: అన్ స్టాపబుల్ మీద కన్నేసిన నెట్‌ఫ్లిక్స్.. అల్లు అరవింద్ కి భారీ ఆఫర్ ఇచ్చిన..

Aha: అల్లు అరవింద్ స్థాపించిన ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ కు మొదట్లో అంత గుర్తింపు రాలేదని చెప్పుకోవాలి.

Arun Chilukuri
Published on: 30 Dec 2022 11:22 AM IST
Netflix Gave a Huge Offer to Allu Aravind
X

Aha: అన్ స్టాపబుల్ మీద కన్నేసిన నెట్‌ఫ్లిక్స్.. అల్లు అరవింద్ కి భారీ ఆఫర్ ఇచ్చిన..

Aha: అల్లు అరవింద్ స్థాపించిన ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ కు మొదట్లో అంత గుర్తింపు రాలేదని చెప్పుకోవాలి. కానీ కొన్ని సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆహా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ టాక్ షో తో మరింత పాపులర్ అయిపోయింది. ఆహా సక్సెస్ వెనుక అన్ స్టాపబుల్ భాగస్వామ్యం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే అల్లు అరవింద్ నిర్మించిన చాలా వరకు సినిమాలు ఆహా కానీ నెట్‌ఫ్లిక్స్ కి కానీ వెళుతూ ఉంటాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం అల్లు అరవింద్ కి నెట్‌ఫ్లిక్స్ ఒక పెద్ద ఆఫర్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అన్ స్టాపబుల్ సీజన్ 1 మరియు సీజన్ 2 ని రైట్స్ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేయాలని అనుకుంటుందట. ఇక త్వరలోనే అన్ స్టాపబుల్ షో కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అతిథిగా విచ్చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ ఆహా లో మాత్రమే కాకుండా నెట్‌ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ప్రభాస్ మరియు బాల కృష్ణ ఎపిసోడ్ పై క్రేజ్ కూడా మామూలుగా లేదు.

అందుకే అన్ స్టాపబుల్ షో స్ట్రీమింగ్ రైట్స్ కూడా పొందాలని నెట్‌ఫ్లిక్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తుందట. ఇక నెట్‌ఫ్లిక్స్ మాత్రమే కాక మరొక రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఈ షో రైట్స్ ను పొందడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి అల్లు అరవింద్ అన్ స్టాపబుల్ ని కేవలం ఆహా ఎక్స్ క్లూజివ్ గా ఉంచేస్తారా లేక నెట్‌ఫ్లిక్స్ తో కూడా పంచుకుంటారా అని ఇంకా తెలియాల్సి ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story