Thandel: చైతూ కెరీర్‌లో బిగ్‌ డీల్‌.. భారీ ధరకు ‘తండేల్‌’ ఓటీటీ రైట్స్‌..

Thandel OTT Rights: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘తండేల్’.

Arun Chilukuri
Updated on: 29 April 2024 7:00 PM IST
Netflix Bought the Digital Rights of Thandel for Rs 40 Crores
X

Thandel: చైతూ కెరీర్‌లో బిగ్‌ డీల్‌.. భారీ ధరకు ‘తండేల్‌’ ఓటీటీ రైట్స్‌..

Thandel OTT Rights: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దేశభక్తి అంశాలతో నిండిన రా రస్టిక్‌ ప్రేమకథతో ఇది తెరకెక్కుతోంది. చైతన్య ఇందులో రాజు అనే మత్స్యకారుడిగా కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డీల్‌ పూర్తయింది.


చైతూ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.40 కోట్లకు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) మూవీ రైట్స్‌ను దక్కించుకుంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘తండేల్‌’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. థియేట్రికల్‌ రన్‌ ముగిసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story