Netflix: భారీ మొత్తానికి అమ్ముడైన చిరు సినిమా రైట్స్..

Netflix Bags Chiranjeevi’s two Films
x

Netflix: భారీ మొత్తానికి అమ్ముడైన చిరు సినిమా రైట్స్..

Highlights

Netflix: ఈ మధ్యనే "ఆచార్య" సినిమాతో మెగాస్టార్ చిరంజీవి అతి పెద్ద డిజాస్టర్ ను అందుకున్న సంగతి తెలిసిందే.

Netflix: ఈ మధ్యనే "ఆచార్య" సినిమాతో మెగాస్టార్ చిరంజీవి అతి పెద్ద డిజాస్టర్ ను అందుకున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ముఖ్యపాత్రలో కొరటాల శివ వంటి స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. విడుదలైన మొదటి రోజు నుంచి నెగిటివ్ రెస్పాన్స్ ను అందుకున్న ఈ సినిమా చివరికి బాక్సాఫీస్ వద్ద పెద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది.

తాజాగా చిరంజీవి తన తదుపరి సినిమా "గాడ్ ఫాదర్" పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమా అక్టోబర్ 5న థియేటర్లలో విడుదల కాబోతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి కె.ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ డైరెక్షన్లో "వాల్తేరు వీరయ్య" సినిమా లో నటించనున్నారు. రవితేజ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ గారు కూడా చిరంజీవి "భోళా శంకర్" అనే సినిమాను సైన్ చేశారు.

తమిళంలో హిట్ అయిన "వేదాలం" అనే సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా ఏప్రిల్ 2023న థియేటర్లో విడుదల కాబోతోంది. చూస్తూ ఉంటే ప్రతి మూడు నెలలకి ఒకసారి చిరంజీవిది ఏదో ఒకటి సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా డిజిటల్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ వారు గాడ్ ఫాదర్ సినిమా డిజిటల్ రైట్స్ ను 55 కోట్లు పెట్టి కొనుగోలు చేయగా వాల్తేరు వీరయ్య సినిమా రైట్స్ కోసం 50 కోట్లు సమర్పించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories