కాంట్రవర్సీ క్వీన్‌ కంగనాకు నేతాజీ కూతురు కౌంటర్

Anita Bose: కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ కామెంట్స్ వివాదం కంటిన్యూ అవుతోంది.

Arun Chilukuri
Published on: 17 Nov 2021 9:00 PM IST
Netaji Subhas Chandra Bose Daughter Anita Bose Reacts to Kangana Ranauts Comment
X

కాంట్రవర్సీ క్వీన్‌ కంగనాకు నేతాజీ కూతురు కౌంటర్

Anita Bose: కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ కామెంట్స్ వివాదం కంటిన్యూ అవుతోంది. తాజాగా జాతిపిత మహాత్మా గాంధీని టార్గెట్ చేశారు కంగనా రనౌత్. భారత స్వతంత్ర నేతలు గాంధీ, నెహ్రూ, మహమ్మద్ అలీ జిల్లా వంటి వారంతా నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను బ్రిటిష్ పాలకులకు అప్పగిస్తామని ఒప్పందం చేసుకున్నారంటూ వచ్చిన పాత పేపర్ ఫొటోను షేర్ చేసి మీరు గాంధీ అభిమానులా లేక నేతాజీ మద్దతుదారులా రెండూ మాత్రం కాలేరు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కంగనా.

మరోవైపు కంగనా కామెంట్స్‌పై నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ స్పందించారు. నేతాజీ, గాంధీజీ ఇద్దరు భారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు పోరాడిన గొప్ప హీరోలన్నారు. భారత స్వాతంత్ర్యం అనేది సంయుక్త పోరాటం అన్న అనితా బోస్ ఒకరిని కాదని మరొకరిని ఎంపిక చేసుకోలేమని కౌంటర్ ఇచ్చారు. స్వాతంత్ర్యం అహింసా మార్గంతోనే రాలేదన్న అనిత నేతాజీతో పాటు భారత జాతీయ సైన్యం కూడా కీలక పాత్ర పోషించిందని మనందరికీ తెలుసని చురకలంటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story