ఇది నా పెళ్ళికి ముందు చివరి ముద్దు!

ఇది నా పెళ్ళికి ముందు చివరి ముద్దు!
x
image from Nehha Pandse instagram
Highlights

సెలబ్రిటీలు ఏం చేసినా సంచలనం అవుతుంది. అందులోనూ నేహాపెండ్సే లాంటి హాట్ భామల విషయంలో అది మరింత ఎక్కువ ఉంటుంది. వారు చేసే ఏ పనైనా అది మంచి కానీ, చేదు...

సెలబ్రిటీలు ఏం చేసినా సంచలనం అవుతుంది. అందులోనూ నేహాపెండ్సే లాంటి హాట్ భామల విషయంలో అది మరింత ఎక్కువ ఉంటుంది. వారు చేసే ఏ పనైనా అది మంచి కానీ, చేదు కానీ సోషల్ మీడియాలో వైరల్ అయి తీరుతుంది. ఇప్పుడు ఆమె అటువంటి సంచలనమే చేసింది.

నేహా పెండ్సే ఎప్పుడూ ట్రేండింగ్ లో ఉండే నటి. నిత్యం ఎదో ఒక విధంగా ఆమె వార్తల్లో నిలుస్తారు. అయితే, ఆమె ఈసారి విభిన్నంగా ట్రేండింగ్ లోకి వచ్చారు. ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆమె తన కాబోయే భర్త శార్దూల సింగ్ బయాస్ ను ముద్దాడుతున్న ఆ ఫోటో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. హిందీ టీవీ షో 'మే ఐ కమిన్ మేడం' తో బాగా పాప్యులర్ అయినా ఈ భామ ఇప్పుడు కుర్రకారుకు అభిమాన సెలబ్రిటీ.

ఈ నవతరం అందాల భరిణె కొంత కాలంగా శార్దూల సింగ్ బయాస్ తో ప్రేమలో ఉంది. ఇటీవల వీరి వివాహానికి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. జనవరి 5 వ తేదీన వీరిద్దరి వివాహం జరుగనుంది. ఈ లోపైగా ఈ అమ్మడు తన సింగిల్ లైఫ్ ని విపరీతంగా ఎంజాయ్ చేస్తోంది. త్వరలో పెళ్లి కానుండడంతో తను సింగిల్ గా చేయాలనుకున్న సరదా పనులన్నీ కానిచ్చేస్తోంది. ఇందులో భాగంగానే తన కాబోయే భర్తకు గాఢంగా ఓ ముద్దిచ్చేసింది. ఆ సీన్ ను ఫోటో తీసి దానిని ఇంస్టాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది.. ఆ పిక్ కాస్తా వైరల్ అయిందిప్పుడు. పైగా ఆ ఫోటో పై బోలెడన్ని కామెంట్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇక సారా జెస్సికార్ రూపొందించిన 'సెక్స్ అండ్ సిటీ పోర్ట్రయిడ్' లోని ఒక క్యారెక్టర్ 'క్యారీ బ్రాడ్ షా' ను కోట్ చేస్తూ ఈ ఫోటోకి ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది నేహా. 'సింగిల్ గర్ల్ చివరి ముద్దు' అంటూ ఆమె ఇచ్చిన క్యాప్షన్ కూడా ఇప్పుడు నెటిజన్లను ఊపేస్తోంది.

ఏదిఏమైనా సెలబ్రిటీలు చేసే పనుల్లో ఇలాంటి చిలిపి పనులు కూడా ఉంటాయి సుమా.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories