Aryan Khan: ఓ కొత్త నటితో ఆర్యన్‌ 'డ్రగ్స్‌ చాట్‌'

* ఇవాళ ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ * ఆర్యన్‌ బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పు

Sandeep Reddy
Published on: 20 Oct 2021 1:17 PM IST
NCB Reveals Aryan Khan Drugs Chat History with Upcoming Bollywood Actress
X

Aryan Khan: ఓ కొత్త నటితో ఆర్యన్‌ ‘డ్రగ్స్‌ చాట్‌’

Aryan Khan: ముంబయి క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో బాలీవుడ్‌ స్టార్‌ షారూక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు ఇంకా ఊరట లభించలేదు. ప్రస్తుతం అతడు ఆర్థర్‌ రోడ్‌ జైలులో ఉండగా ఆర్యన్‌ బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించనుంది. ఇదిలా ఉండగా ఓ బాలీవుడ్‌ నటితో ఆర్యన్‌ డ్రగ్స్‌ గురించి చాటింగ్‌ చేసినట్లు ఎన్‌సీబీ దర్యాప్తులో గుర్తించింది. అందుకు సంబంధించిన ఆధారాలను నేడు కోర్టుకు సమర్పించింది.

అక్టోబరు 2న క్రూయిజ్‌ నౌకపై పార్టీ జరుగుతున్న సమయంలో ఆర్యన్‌ ఖాన్‌.. ఓ నటితో డ్రగ్స్‌ గురించి వాట్సాప్‌లో చాటింగ్‌ చేశారని, అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఎన్‌సీబీ తెలిపింది. ఆ నటి త్వరలోనే బాలీవుడ్‌కు పరిచయం కానుందట. అంతేగాక, డ్రగ్స్‌ విక్రేతలతో ఆర్యన్‌ చాటింగ్‌ చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన వాట్సాప్‌ చాట్‌లను ఎన్‌సీబీ నేడు కోర్టుకు సమర్పించింది. డ్రగ్స్‌ విక్రేతలకు రెగ్యులర్ కస్టమర్‌ అని తమ దర్యాప్తులో తేలినట్లు ఎన్‌సీబీ వెల్లడించింది. ఆర్యన్ బెయిల్‌పై కోర్టు తీర్పు ఇవ్వనున్న సమయంలో ఎన్‌సీబీ ఈ నివేదిక సమర్పించడం గమనార్హం.

ఆర్యన్‌ ఖాన్ బెయిల్‌ పిటిషన్‌పై ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు కోర్టు తీర్పు వెలువరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అతడి బెయిల్‌ను కోర్టు ఇప్పటికే రెండు సార్లు తిరస్కరించింది. మరోవైపు జైల్లో ఉన్న ఆర్యన్‌కు ఇటీవల అధికారులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. విడుదల అయిన తర్వాత పేదల సంక్షేమానికి కృషి చేస్తానని.. తనకు చెడ్డపేరు తెచ్చే పనులు చేయబోనని, చెడు మార్గంలో వెళ్లనని ఆర్యన్‌ హామీ ఇచ్చాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story