డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ముమ్మర దర్యాప్తు!

డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ముమ్మర దర్యాప్తు!
x
Highlights

హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కేసులో భాగంగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ రాకెట్ పై NCB దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన...

హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కేసులో భాగంగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ రాకెట్ పై NCB దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ అధికారులు కొందరు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసి విచారిస్తున్నారు. త్వరలోనే మరికొందరికి నోటీసులు జారీ చేసే పనిలో ఉన్నారు.

డ్రగ్స్ కేసులో అనేక కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఎన్సీబీ అధికారుల విచారణలో హీరోయిన్ సారా అలీ ఖాన్‌ కీలక విషయాలను వెల్లడించింది. సుశాంత్ తో తాను కొంత కాలం డేటింగ్ చేశానని ఇది వాస్తవమని చెప్పింది. ఆయనతో కలిసి థాయ్ లాండ్ పర్యటనకు వెళ్లానని తెలిపింది. తనకు సిగరెట్ తాగే అలవాటు ఉందని, అయితే డ్రగ్స్ ఎప్పుడూ తీసుకోలేదని చెప్పింది. సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని తెలిపింది.

మరోవైపు దీపికా పదుకునే, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, ఫ్యాషన్ డిజైనర్ సిమోనీ, దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్ లను కూడా ఎన్సీబీ అధికారులు ఇప్పటికే విచారించారు. కరణ్ జొహార్ నిర్మాణ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్న క్షితిజ్ రవి ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. వచ్చే నెల 3వ తేదీ వరకు ప్రసాద్‌కు ముంబై కోర్టు రిమాండ్ విధించింది.

సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ కేసులో సీబీఐ విడుదల చేసిన స్టేట్‌మెంట్‌పై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. హత్యారోపణ కింద FIR నమోదు చేసి వెంటనే దోషులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ వ్యవహారంతో సుశాంత్ సింగ్ మృతి కేసు మొత్తం పక్కదారి పట్టడంతో అతని స్నేహితులు గణేష్ మరియు అంకిత్ నిరాహార దీక్షకు దిగారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు న్యాయం జరగాలంటూ వారు నిరాహార దీక్ష చేస్తున్నారు. కేసు నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

మొత్తానికి సుశాంత్ సింగ్ మృతితో ప్రారంభమైన కేసు మెల్లగా డ్రగ్స్ వైపు మరలింది. సుశాంత్ సింగ్ కేసు మరుగున పడిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇంకా ఈ ఎపిసోడ్‌లో ఎంతమంది ఉన్నారు డ్రగ్స్ కేసు విచారణలో ఇంకా ఎన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో కాలమే చెబుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories