Nazriya Nazim: 'అంటే.. సుందరానికీ!' స్టార్ట్ అయిందంటున్న నజ్రియా

Nazriya Nazim: నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ''అంటే.. సుందరానికీ!''.

Samba Siva Rao
Published on: 19 April 2021 1:16 PM IST
Nazriya Nazim Joins Nanis Ante Sundaraniki Movie shoot
X

అంటే.. సుందరానికీ! మూవీ ఇమేజ్

Nazriya Nazim: నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ''అంటే.. సుందరానికీ!''. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతుంది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ ఫహాద్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. నజ్రియా నజీమ్ ఫహాద్ 2013లో వచ్చిన 'రాజా రాణి' అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు వారికి పరిచయమైంది. టైటిల్ అనౌన్సమెంట్ పోస్టర్‌తోనే ఈ సినిమాపై ఆసక్తిని కలిగించారు. అయితే తాజాగా 'అంటే.. సుందరానికీ!' షూటింగ్ స్టార్ట్ చేసినట్లు హీరోయిన్ నజ్రియా తెలిపారు.

నజ్రియా నజీమ్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడుతూ.. "అందరికీ నమస్కారం.. ఈరోజు నా ఫస్ట్ తెలుగు సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అనేది ఎప్పుడూ ఏదైనా స్పెషల్ గా ఉంటుంది. కాబట్టి 'అంటే సుందరానికీ' నాకు స్పెషల్" అని పేర్కొన్నారు. మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని - యలమంచిలి రవిశంకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. రవితేజ గిరిజాల ఎడిటర్.

'బ్రోచేవారేవరురా' 'మెంటల్ మదిలో' చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. నాని వరుస సినిమాలతో బీజీగా గడుపుతున్నారు. ఇప్పటికే నాని నటించిన 'టక్ జగదీష్' సినిమా షూటింగ్ ఫైనల్ వచ్చేయగా.. మరో మూవీ 'శ్యామ్ సింగరాయ్' షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇది పూర్తి కాకముందే తన నెక్ట్స్ మూవీ 'అంటే.. సుందరానికీ!' షూటింగ్ స్టార్ట్ చేసేశాడు. నాని కెరీర్‌లో ఇది 28వ చిత్రం కావడం విశేషం.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story