Nayanthara: నయనతార అందుకే గుళ్ళ చుట్టూ తిరుగుతుందా?

Nayanthara: అందరి దేవుళ్ళని దర్శించుకుంటున్న సౌత్ స్టార్ జంట

admin1
Updated on: 20 Oct 2021 4:16 PM IST
Nayanthara Vignesh Visiting All Temple
X

నయనతార మరియు విగ్నేష్ (ఫైల్ ఇమేజ్)

Nayanthara: సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార గత కొద్దిరోజులుగా తన బాయ్ ఫ్రెండ్ మరియు కాబోయే భర్త అయిన విగ్నేష్ శివన్ తో కలిసి గుడుల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. దసరా పండుగ మొదలైన దగ్గర్నుంచి నయనతారా మరియు విగ్నేష్ చాలా గుళ్ళు దర్శించుకుని వచ్చారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ జంట ముందుగా మహాలక్ష్మి గుడికి వెళ్లి ఆ తర్వాత ముంబైలోని సిద్ధి వినాయకుడి గుడి కి కూడా వెళ్లి దర్శనం చేసుకొని వచ్చారు. ఆ తరువాత శిరిడి వెళ్లి సాయిబాబా ని దర్శించుకుని ఈ మధ్యనే తిరిగి వచ్చారు నయన్ మరియు విగ్నేష్.

అయితే వీరు గుళ్ళ చుట్టూ తిరుగుతున్న కారణం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి అని వార్తలు వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే నయనతార మరియు విగ్నేష్ పెళ్లి చేసుకోబోతున్నారు. క్రిస్టియన్ గా పుట్టినప్పటికీ నయనతార క్రిస్టియానిటీ మరియు హిందూయిజం రెండు మతాలను ఫాలో అవుతారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ, పంజాబ్, ఆంధ్ర ప్రదేశ్ లలో నయనతార చాలా గుళ్లకు వెళ్లి వచ్చింది. మరోవైపు కోలీవుడ్ లోని ప్రముఖ దర్శకులలో ఒకరు విఘ్నేష్. వీరిద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే.

admin1

admin1

Next Story