Nayanthara- Vignesh Shivan: నయనతార- విఘ్నేష్‌ శివన్‌ల నిశ్చితార్థం..

Nayanthara- Vignesh Shivan Romantic Photo Viral
x

నయన తార, విఘ్నేశ్ (ఫొటో ఇన్‌స్టాగ్రాం)

Highlights

Nayanthara: సౌత్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల తన చేతికి ప్లాటినమ్‌ రింగ్‌ ఉన్న ఫొటోను షేర్‌ చేసింది.

Nayanthara: సౌత్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల తన చేతికి ప్లాటినమ్‌ రింగ్‌ ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. ఆ ఫొటోకు 'వేలితో పాటు ప్రాణాన్ని కూడా చేర్చి' అని విఘ్నేష్‌ శివన్‌ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, నయనతార, విఘ్నేష్‌ ఇద్దరికీ నిశ్చితార్థం అయిందని ఆ ఫొటో స్పష్టం చేసింది. తాజాగా విఘ్నేష్‌ మరో ఫొటోను షేర్‌ చేశారు. ఈస్టర్‌ పండగ సందర్భంగా దిగిన ఫొటో ఇది. ఒకరి కళ్లల్లోకి ఒకరు ప్రేమగా చూస్తున్న ఈ ఫొటోలో మాంచి రొమాంటిక్ లుక్ లో ఉన్నారు. త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నారని టాక్ నడుస్తోంది.

కాగా, మొదట శింబుతో ప్రేమాయణం నడిపిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ప్రభుదేవాను ప్రేమించింది. వీరిద్దరితో కట్ చేసుకొని ప్రస్తుతం యాక్టర్ కమ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం సాగిస్తోంది. ఈమేరకు సోషల్ మీడియాలో తాజాగా ఆమె చేసిన ఓ పిక్ వైరల్‌గా మారింది.

నయనతార గత కొన్నేళ్లుగా విఘ్నేష్ తో షీకార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లేడీ సూపర్ స్టార్ కి ఇదే చివరి ప్రేమ ప్రయాణమని, ఇక అమ్మడు పెళ్లి పీటలెక్కేస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటీవలే తన ప్రియుడి గుండెల మీద చేయి వేసి దిగిన ఓ పిక్ షేర్ చేస్తూ చేతికి ఉన్న రింగ్ ను ఫోకస్ చేసింది ఈ అందాలతార. ఈ నేపథ్యంలో తాజాగా ప్రియుడి కౌగిలిలో మునిగి రొమాంటిక్ మూడ్‌లో ఉన్న మరో పిక్ చేసింది నయనతార. ఈస్టర్ పండుగ సందర్భంగా ఈ లవ్ బర్డ్స్ ఇలా ప్రేమలో మునిపోయారు. స్వయంగా నయన్.. ఈ పిక్‌ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో వెంటనే వైరల్ అయింది.


Show Full Article
Print Article
Next Story
More Stories