Nayanthara: నయన్ విఘ్నేష్ ల నిశ్చితార్థం

Nayanthara-Vignesh Shivan: న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ నిశ్చితార్థం అయిపోయిందని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్

Kranthi
Updated on: 26 March 2021 7:26 AM IST
NAYANTHARA VIGNESH SHIVAN GETTING ENGAGED PICTURE GOES VIRAL
X

Nayanthara- Vignesh Shivan:(Vignesh Shivan ఇంస్టాగ్రామ్)

Nayanthara- Vignesh Shivan: ద‌క్ష‌ణాది లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, కోలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ నిశ్చితార్థం అయిపోయిందని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా విఘ్నేష్ శివ‌న్ త‌న సోష‌ల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేశారు. అందులో విఘ్నేష్, న‌య‌న‌తార దగ్గరగా ఉన్నారు. ఇక వీరి మొహాలు కనిపించనప్పటికీ.. అందులో న‌య‌న్ చేతికి రింగు ఉంది. దీంతో ఈ ఇద్ద‌రి ఎంగేజ్‌మెంట్ అయిపోయింద‌ని ప‌లువురు భావిస్తున్నారు. అంతేకాదు ఆ ఫొటోను చూసిన ప‌లువురు నెటిజ‌న్లు కంగ్రాట్స్ అంటూ వారిద్ద‌రికి అభినంద‌న‌లు చెబుతున్నారు.

గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ప్రేమ‌లో ఉన్న విష‌యం తెలిసిందే. విఘ్నేష్ శివ‌న్ తెర‌కెక్కించిన నానుమ్ రౌడీదాన్ చిత్రంలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించింది. ఈ మూవీ షూటింగ్ స‌మ‌యంలో వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ మొద‌లైంది.విఘ్నేష్ శివ‌న్ తెర‌కెక్కించిన నానుమ్ రౌడీదాన్ చిత్రంలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించింది. ఈ మూవీ షూటింగ్ స‌మ‌యంలో వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ మొద‌లైంది. ఆ త‌రువాత వీరిద్ద‌రు క‌లిసి ప‌లు ఫంక్ష‌న్‌ల‌లో క‌నిపించ‌డంతో పాటు చెట్టాప‌ట్టాలేసుకొని విదేశాలు తిరిగారు. ఆ ఫొటోల‌ను విఘ్నేష్ త‌రచుగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకునేవాడు. ఈ క్ర‌మంలో వీరిద్దరు పెళ్లికి రెడీ అయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఒక‌టి రెండు సార్లు న‌య‌న్, విఘ్నేష్ పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు చాలా సార్లు పుకార్లు వినిపించాయి. అయితే త‌మ‌కు జీవితంలో సాధించాల్సిన‌ కొన్ని కోరిక‌లు ఉన్నాయ‌ని, వాటిని నెర‌వేర్చుకున్న త‌రువాతనే పెళ్లి చేసుకుంటామ‌ని.. ప్ర‌స్తుత‌మైతే ఇద్ద‌రం ప్రేమ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నామ‌ని ఆ మ‌ధ్య‌న ఓ ఇంట‌ర్వ్యూలో విఘ్నేష్ తెలిపారు. కాగా విఘ్నేష్ శివ‌న్ ప్ర‌స్తుతం విజ‌య్ సేతుప‌తితో కాటువాకులా రెండు కాద‌ల్ అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అందులో న‌య‌న‌తార‌, స‌మంత హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

Kranthi

Kranthi

Next Story