Nayanthara: విఘ్నేశ్‌ శివన్‌ను అన్‌ఫాలో చేసిన నయనతార..

Nayanthara: కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార-విగ్నేష్ శివన్ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటారు.

Shekhar G
Updated on: 2 March 2024 2:34 PM IST
Nayanthara Unfollow Her Husband Vignesh Shivan In Social Media New Rumours Goes Viral
X

Nayanthara: విఘ్నేశ్‌ శివన్‌ను అన్‌ఫాలో చేసిన నయనతార..

Nayanthara Vignesh Shivan: కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార-విగ్నేష్ శివన్ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటారు. కొన్నేళ్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని సరోగసి పద్దతిలో కవల పిల్లలని కూడా కన్నారు ఈ జంట. అసలు క్యూట్ కపుల్ అంటే ఇలా ఉండాలి అని అందరూ అనుకునేలా ఫోటోలు, వీడియోలు షేర్ చేసేవారు. తాజాగా నయనతార తన భర్త విఘ్నేశ్‌ శివన్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో వీరిద్దరి మధ్య ఏం జరిగింది ?.. నయనతార ఎందుకు ఇలా చేసింది ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నయనతార తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. ఆమె కన్నీళ్లతో కూడా ఇది నాకు లభించిందని ఎప్పటికీ చెబుతుంది అనే అర్ధం వచ్చేలా ఇంగ్లీష్ లో ఓ కొటేషన్ పెట్టింది. దీంతో ఈ వార్త ఇప్పుడు కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో వైరల్ గా మారింది. దీంతో నయన్ తన భర్తతో విడిపోతుందా ?.. అంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇక్కడ నయన్ అన్ ఫాలో చేసినా, విగ్నేష్ ఇంకా ఫాలో చేస్తున్నాడు. సోషల్ మీడియాలో వీరిద్దరి ఫోటోలు మాత్రం అలాగే ఉన్నాయి.

Shekhar G

Shekhar G

Next Story