Nayanthara: సీక్వెల్ సినిమా సైన్ చేసిన నయనతార

సీక్వెల్ సినిమా సైన్ చేసిన నయనతార
Nayanthara: సీక్వెల్ సినిమా సైన్ చేసిన నయనతార
Nayanthara: సార్ బ్యూటీ నయనతార ఇప్పుడు వరుసగా తెలుగు తమిళ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ భామ ఒక ప్రాజెక్టును సైన్ చేసి వార్తల్లో నిలిచింది. 1993లో విడుదలైన "జెంటిల్ మ్యాన్" సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ ను ప్రకటించారు నిర్మాత కుంజుమోన్ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అర్జున్ సర్జా హీరోగా విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డులు వర్షం కురిపించింది.
ఇక తాజాగా జెంటిల్ మెన్ 2 కి సినిమాకి సంగీతాన్ని అందించడానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి రంగంలోకి దింపారు దర్శకనిర్మాతలు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం నయనతారను సంప్రదించగా ఈ స్టార్ బ్యూటీ కూడా వెంటనే ఓకే చెప్పిందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహించనున్నారు అనే విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. మరోవైపు నయనతార తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తున్న "గాడ్ ఫాదర్" సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
బిహార్‌లో కన్నీటి పర్యంతమైన గ్రాడ్యుయేట్ ఛాయ్‌వాలీ
20 Aug 2022 2:07 AM GMTబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
20 Aug 2022 1:43 AM GMTఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMTChandrababu: ఏపీలో దుర్మార్గపు పాలనను అంతమొందించాలి
20 Aug 2022 1:09 AM GMTముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMT