Nayanthara - Shah Rukh: మళ్లీ షారుఖ్ సినిమాలో నటించడానికి సిద్ధమైన నయనతార

Nayanthara Ready to Act in Shah Rukh Khan New Movie
x

మళ్లీ షారుఖ్ సినిమాలో నటించడానికి సిద్ధమైన నయనతార

Highlights

*బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీతో కలిసి ఒక హిందీ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

Nayanthara - Shah Rukh Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీతో కలిసి ఒక హిందీ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో హీరోయిన్ పాత్రకోసం నయనతార ని ఎంపిక చేశారు దర్శక నిర్మాతలు.

అయితే షారూఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇక ఈ సినిమా కోసం డేట్లు ఇవ్వలేకపోయినా నయనతార ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత ను ఎంపిక చేశారు దర్శక నిర్మాతలు. కానీ తాజా సమాచారం ప్రకారం నయనతార ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్యనే బెయిల్ మీద ఆర్యన్ ఖాన్ బయటకి వచ్చేసిన సంగతి తెలిసిందే. దీంతో షారుఖ్ ఖాన్ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారట. దీంతో నయనతార మళ్లీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు రెడీ అయినట్లు సమాచారం.

అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమాలో నయనతార ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో అందరి దృష్టిని ఆకర్షించబోతున్నారు. నయనతార కాకుండా ఈ సినిమాలో మరో ముగ్గురు హీరోయిన్లు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా గురించి వివరాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories