Nizhal Movie: ఓటీటీలో న‌య‌నతార కొత్త సినిమా..

Nizhal Movie: ఈ మూవీలో చాకో బోబన్ – నయనతార హీరో హీరోయిన్లుగా నటించారు

Samba Siva Rao
Published on: 7 May 2021 5:02 PM IST
Nayanthara Nizhal Movie streaming in Ott
X

నయనతార నిజల్ మూవీ (ఫైల్ ఇమేజ్)

Nizhal Movie: సౌత్ ఇండియ‌న్ లేడి సూప‌ర్ స్టార్ న‌య‌నతార తెలుగు, తమిళ భాషల్లోనే కాదు మలయాళంలోనూ స్టార్ హీరోయిన్ గా గుర్తిపు తెచ్చుకుంది. గ‌త ఏడాది న‌య‌నతార ప్ర‌ధాన పాత్ర పోషించిన‌ అమ్మోరు త‌ల్లి అనే సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా నయనతార మ‌రో సినిమా ఓటీటీలో ప్ర‌సారం కానుంది. మలయాళంలో నిజల్ అనే సినిమాలోనూ నయన్ నటించింది. మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది.

ఈ మూవీలో చాకో బోబన్ – నయనతార హీరో హీరోయిన్లుగా నటించగా సైజు కురుప్, దివ్య ప్రభా, రోనీ డేవిడ్ ముఖ్యపాత్రల్లో నటించారు. మే 9న ఈ సినిమా ఓటీటీ వేదికగా రిలీజ్ కాబోతుంది. 4K & Dolby ఓటీటీ సంస్థ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు అప్పు ఎన్ భట్టతిరి దర్శకత్వం వహించారు.

ఒక పక్క స్టార్‌ హీరోలతో నటిస్తూనే.. మరో పక్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌తో న‌య‌న్ దూసుకుపోతుంది. నయనతార సూపర్ స్టార్ రజినికాంత్ కథానాయకుడిగా వచ్చిన 'దర్బార్' చిత్రంలో ఆయనకు జోడిగా నటించింది. ఆతర్వాత అమ్మోరు త‌ల్లి అనే త‌మిళ అనువాద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నయన్. ప్ర‌స్తుతం న‌య‌న్ చేతిలో తెలుగు, త‌మిళ చిత్రాలు ఉన్నాయి.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story