విలన్ పాత్రలో కనిపించబోతున్న లేడీ సూపర్ స్టార్

విలన్ పాత్రలో కనిపించబోతున్న లేడీ సూపర్ స్టార్
x
Highlights

ఈ మధ్యనే 'పేట' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే....

ఈ మధ్యనే 'పేట' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'దర్బార్' అనే టైటిల్ ను ఈ సినిమాకు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో నయనతార పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నయనతార విలన్ పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో నయనతార పాత్ర కి నెగిటివ్ షేడ్స్ ఉంటాయి అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ అది నిజమే అయితే సూపర్ స్టార్ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విలన్ గా కనిపిస్తుందన్నమాట. ఈ సినిమాలో నివేదా థామస్ రజనీకాంత్ కూతురు పాత్రలో కనిపించబోతోంది అని తెలిసిందే. ఈ చిత్రాన్ని లైకా ప్రోడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇంతకుముందు నయనతార రజనీకాంత్ తో కలిసి 'శివాజీ', 'చంద్రముఖి', 'కథానాయకుడు', సినిమాలో కలిసి నటించింది. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు ప్రతీక్ బాబర్ ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా దాదాపు షూటింగ్ మొత్తం ముంబయిలో జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories