Nayanthara: తన పనితో అందరికీ ఆదర్శంగా నిలిచిన నయనతార

Nayanthara: తన పనితో అందరికీ ఆదర్శంగా నిలిచిన నయనతార

Rama Rao
Updated on: 7 July 2022 11:11 AM IST
Nayanthara is a Role Model for Everyone with Her Work
X

Nayanthara: తన పనితో అందరికీ ఆదర్శంగా నిలిచిన నయనతార

Nayanthara: ఈ మధ్యనే ప్రముఖ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న లేడీ సూపర్ స్టార్ నయనతార తిరుమల కి వెళ్లి ఒక వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసింది. కానీ తాజాగా నయనతార చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటిదాకా ఎన్నో అద్భుతమైన పాత్రలో నటించిన నయనతార నిజ జీవితంలో తన సింప్లిసిటీ మరియు సంప్రదాయాలకు ఇచ్చే గౌరవంతో అందరి మనసులను ఎప్పటికప్పుడు దోచుకుంటూ ఉంటుంది.

ఇంతకుముందు తిరుమల కి వెళ్ళినప్పుడు పసుపు తాడుతో కనిపించిన నయనతార ఇప్పుడు విగ్నేష్ శివన్ కట్టిన మంగళసూత్రంతో కనిపించింది. ఎలాంటి కాస్ట్యూమ్ ధరించినప్పటికీ విగ్నేష్ తో కట్టించుకున్న మంగళ సూత్రాన్ని నయనతార అలానే వేసుకొని ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది.

జీన్స్, టీ షర్టు వంటి మోడరన్ డ్రెస్సు వేసుకున్నప్పటికీ సంప్రదాయాన్ని మర్చిపోకుండా మంగళ సూత్రంతో కనిపించి నయనతార ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఈ మధ్యకాలంలో హీరోయిన్లు పెళ్లి అయినప్పటికీ నల్లపూసలు కానీ మంగళ సూత్రం కానీ ధరించడం లేదు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ నయనతార మంగళసూత్రాన్ని ధరించి అందరికీ ఆదర్శంగా నిలిచింది.

Rama Rao

Rama Rao

Next Story