Nayanthara: ఇదిగో నా ఎంగేజ్మెంట్ రింగ్ అంటున్న నయనతార

Nayanthara: ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమైనా వరుస సూపర్ హిట్ సినిమాలతో ముందుకు దూసుకుపోతోంది లేడీ సూపర్ స్టార్ నయనతార

admin1
Published on: 11 Aug 2021 1:38 PM IST
Nayanthara is Engaged With Boyfriend Vignesh Shivan
X

నయనతార (ఫైల్ ఇమేజ్)

Nayanthara: ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమైనా వరుస సూపర్ హిట్ సినిమాలతో ముందుకు దూసుకుపోతోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. అయితే ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు విగ్నేష్ శివన్ మరియు నయనతార ప్రేమించుకుంటున్నారనే విషయం ఓపెన్ సీక్రెట్ లాంటిది. వారి ప్రేమాయణం గురించి ఇద్దరు ఎప్పుడూ బయటకు చెప్పకపోయినా నయనతార మరియు విగ్నేష్ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటున్నారని అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కి ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటూ నయనతార అందరికీ షాక్ ఇచ్చింది.

తాజాగా తన తదుపరి సినిమా 'నెట్రికన్' ప్రమోషన్స్ లో భాగంగా ఒక టీవీ షో కి వెళ్ళిన నయనతార ఈ విషయాన్ని రివీల్ చేసింది. ఈ ఎపిసోడ్ యొక్క ప్రోమో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "ఇది నా ఎంగేజ్మెంట్ రింగ్," అంటూ నయనతార తన ఉంగరం వైపు చూపిస్తూ మురిసిపోయింది. అంతేకాక విగ్నేష్ లో మీకు ఏమి ఇష్టం అని యాంకర్ అడగగా అన్నీ ఇష్టమే అని చెప్పుకొచ్చింది. ఇక ఈ మధ్యనే "నిజల్" అనే మలయాళం సినిమాలో కనిపించిన నయనతార రజనీకాంత్ హీరోగా వస్తున్న "అన్నాతే" సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

admin1

admin1

Next Story