"జెంటిల్ మాన్ 2" కోసం హీరోయిన్ ఖరారు.. ఎవరంటే..?

Gentleman 2: ప్రముఖ సౌత్ డైరెక్టర్ శంకర్ ని అభిమానులు ప్రేమగా ఇండియన్ జేమ్స్ కామెరూన్ అని పిలుస్తారు అన్న సంగతి తెలిసిందే.

admin1
Updated on: 24 March 2022 11:58 AM IST
Nayanthara Chakravarthy Selected as Heroine in Gentleman 2 Movie | Director Shankar New Movie
X

"జెంటిల్ మాన్ 2" కోసం హీరోయిన్ ఖరారు.. ఎవరంటే..? 

Gentleman 2: ప్రముఖ సౌత్ డైరెక్టర్ శంకర్ ని అభిమానులు ప్రేమగా ఇండియన్ జేమ్స్ కామెరూన్ అని పిలుస్తారు అన్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో విడుదలై బ్లాక్ బస్టర్ గా మారిన ఎన్నో సినిమాలలో "జెంటిల్మన్" కూడా ఒకటి. పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లలో రికార్డుల తో సంచలనం సృష్టించింది.

తాజాగా నిర్మాత ఈ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా ను త్వరలోనే ప్యాన్ ఇండియన్ రేంజిలో విడుదల చేస్తామని నిర్మాత ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు కనిపించబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

తాజా సమాచారం ప్రకారం యంగ్ బ్యూటీ నయనతార చక్రవర్తి ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ సినిమాలో హీరో ఎవరు అనే విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

admin1

admin1

Next Story