త్వరలో పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్

Ruthvik
Published on: 29 April 2019 12:56 PM IST
త్వరలో పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్
X

గత కొంతకాలంగా సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార మరియు దర్శకుడు విఘ్నేష్ శివన్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే వీరు సహజీవనం చేస్తున్నట్లు గా ఆధారాలు కూడా బయటకు వచ్చాయి. ఎలాంటి సెలబ్రేషన్ అయినా విదేశాలకు చెక్కేసే ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని బోలెడు పుకార్లు ఇప్పటికే బయటకు వచ్చాయి కానీ అభిమానులకు మాత్రం నిరాశ తప్ప మరేమీ లేదు. ఇక వీరు ఇప్పట్లో పెళ్లి చేసుకునే సూచనలు లేవు అని అందరూ అనుకుంటున్న సమయంలో ఈ జంట మరొక పెద్ద షాక్ ఇచ్చింది.

త్వరలో నయనతార పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ ఏడాది నిశ్చితార్థం చేసుకుని వచ్చే ఏడాది వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నయనతార తన కమిట్మెంట్ లు అన్నీ త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోందట. ఇక సినిమాల పరంగా చూస్తే నయనతార త్వరలో చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమా లో కనిపించనుంది. ఇక ఈమె చేతిలో 'దర్బార్', 'ఇళయతలపతి63', 'మిస్టర్ లోకల్', 'కొళయితిర్ కాలం' వంటి సినిమాలు కూడా ఉన్నాయి.

Ruthvik

Ruthvik

Next Story