అమ్మానాన్నలు కాబోతున్న నయనతార విఘ్నేష్ శివన్

*అమ్మానాన్నలు కాబోతున్న నయనతార విఘ్నేష్ శివన్

Rama Rao
Updated on: 24 March 2022 2:23 PM IST
Nayanthara and Vignesh are Planning a Baby
X

అమ్మానాన్నలు కాబోతున్న నయనతార విఘ్నేష్ శివన్

Nayanthara-Vignesh Shivan: స్టార్ బ్యూటీ నయనతార గత కొంత కాలంగా ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలోనే నిశ్చితార్థం కూడా చేసుకున్నాం అని చెప్పిన నయన్ పెళ్లి గురించి మాత్రం మౌనం గానే ఉంటోంది. ఈ మధ్యనే ఒక వీడియో లో నుదుటిపై సింధూరంతో కనిపించి తమకి ఇప్పటికే పెళ్లయి పోయినట్లుగా హింట్ ఇచ్చింది.

నయనతార మరియు విఘ్నేష్ శివన్ గుళ్ళో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా వీరిద్దరి గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. విగ్నేష్ మరియు నయనతార సరోగసీ ద్వారా పిల్లలను కనడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చెన్నై లోని ఒక ప్రముఖ హాస్పటల్లో ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఒకసారి సరగేట్ మదర్ ని ఎంపిక చేసుకున్నట్లు, ఆమె కడుపులో వీరిద్దరి బిడ్డ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పుకార్లపై వీరిద్దరు ఇంకా రియాక్ట్ అవ్వడం లేదు. సరగసీ ద్వారా పిల్లల్ని కన్న సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, మంచు లక్ష్మి, వంటి సెలబ్రిటీ లు కూడా సరగసి ద్వారా అమ్మానాన్నలు అయినవాళ్లే.

Rama Rao

Rama Rao

Next Story