Nayanthara: పెళ్లి తర్వాత కూడా నయనతారకు బ్రేక్ లేదా?

Nayanthara: పెళ్లి తర్వాత కూడా నయనతారకు బ్రేక్ లేదా?

Rama Rao
Updated on: 18 Jun 2022 3:30 PM IST
After the Marriage Nayantara Got Busy with Movies | Movie News
X

Nayanthara: పెళ్లి తర్వాత కూడా నయనతారకు బ్రేక్ లేదా?

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మధ్యనే ప్రముఖ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట తాజాగా పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే ఇప్పటికే బోలెడు బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన నయనతార పెళ్లి తర్వాత తన స్పీడు ను కొంచెం తగ్గించి సినిమా నుంచి బ్రేక్ తీసుకుంటుందని కొందరు అన్నారు.

కానీ తాజా సమాచారం ప్రకారం నయనతారకి అలాంటి ఆలోచనలు ఏవీ లేవని తెలుస్తోంది ఒకవైపు తన పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే మరో వైపు సినిమాలలో కూడా నటించాలని నయనతార నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.ఇక అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న "జవాన్" సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.

తాజాగా నయనతార కూడా హైదరాబాద్ కి వచ్చి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతోంది. ఇప్పటికే కాజల్ అగర్వాల్, సోనమ్ కపూర్ వంటి హీరోయిన్లు తమ చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ఆ తర్వాత పిల్లలను ప్లాన్ చేశారు. మరోవైపు నయనతార మాత్రం గెస్ట్ పాత్ర లు కాదని లీడ్ పాత్రలు వచ్చిన సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెళ్లి తర్వాత కూడా నయనతార చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా కాబోతోంది అని చెప్పుకోవచ్చు.

Rama Rao

Rama Rao

Next Story