Naveen Polishetty: ఇక్కడ ఫుల్ బిజీ.. ఆ సినిమాలకు టైంలేదు: నవీన్ పొలిశెట్టి

Naveen Polishetty: 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' తో ఆకట్టుకుని, జాతిరత్నాలు తో బంపర్ హిట్ అందుకున్నాడు నవీన్.

Venkata Chari
Updated on: 9 May 2021 10:46 PM IST
Naveen Polishetty Cant Go To Bollywood As He Is Busy In Tollywood
X

నవీన్ పొలిశెట్టి (ఫొటో ట్విట్టర్)

Naveen Polishetty: తొలి సినిమా 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' తో ఆకట్టుకుని, మలి సినిమా జాతిరత్నాలు తో బంపర్ హిట్ అందుకున్నాడు నవీన్ పొలిశెట్టి. ప్రస్తుతం తెలుగులో పలు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారాడు.

తొలి సినిమా తరువాత బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ హీరో.. చిచోరే సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ పాత్రకు గాను మంచి పేరు సంపాదించాడు. దీంతోనే జాతిరత్నాలు సినిమాలో హీరోగా ఆఫర్ వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో.. నవీన్ స్టార్ గా మారిపోయాడు. అయితే బాలీవుడ్ నుంచి కూడా పలు ఆఫర్లు వస్తున్నాయంట. కానీ, తెలుగులో చాలా సినిమాలో బిజీగా మారడంతో.. బాలీవుడ్ సినిమాలకు టైం దొరకడంలేదని అంటున్నాడు ఈ జాతిరత్నాలు హీరో. ఈ మేరకు తెలుగు సినిమాలు పూర్తయితేనే గానీ, బాలీవుడ్‌లో సినిమాలు చేస్తాడని టాక్ వినిపిస్తోంది.

అక్కడ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన 'చిచోరే' అనే సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు నవీన్. యాసిడ్ పేరుతో రూపొందిన ఈ పాత్రలోనూ నవీన్‌కి మంచి మార్కులే పడ్డాయి. అయితే ఆ తర్వాత తన దశ తిరిగింది. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై కేవీ అనుదీప్ హీరోగా అతను 'జాతిరత్నాలు' అనే సినిమాలో హీరోగా నటించే అవకాశం కొట్టేశాడు. అప్పటికే నవీన్‌కి సోషల్‌మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే కరోనా కారణంగా సినిమా వాయిదాపడటంతో.. దొరికన ఖాళీ సమయాన్ని సినిమా ప్రమోషన్లకు వాడుకున్నాడు.

Venkata Chari

Venkata Chari

Next Story