'మీ వల్లే ఆ హీరోయిన్ చనిపోయిందా'..? షాకింగ్ రిప్లై ఇచ్చిన నవదీప్..

Navdeep: నవదీప్ తెలుగు సినీ ప్రేక్షకులందరికీ ఈ పేరు సుపరిచితమే.

Arun Chilukuri
Updated on: 6 May 2023 6:00 PM IST
Navdeep Shocking Reply To Reporter About His Rumour
X

‘మీ వల్లే ఆ హీరోయిన్ చనిపోయిందా’..? షాకింగ్ రిప్లై ఇచ్చిన నవదీప్..

Navdeep: నవదీప్ తెలుగు సినీ ప్రేక్షకులందరికీ ఈ పేరు సుపరిచితమే. జై సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయిన నవదీప్ ఆ తర్వాత పలు భాషా చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమాలతో కంటే వివాదాలతోనే ఈ నటుడు ఎక్కువగా పాపులర్ అయ్యాడు. వెండితెరపై హీరోగా కనిపించినా ఇతడిలో విలనీ వేషాలే ఎక్కువని చాలా మందికి ఒక ఫీలింగ్ ఉంది. అంతేకాదు నవదీప్ గే అని, ఇతడి వల్ల ఒక హీరోయిన్ ఆత్మహత్య చేసుకుందని కూడా అపవాదు ఉంది.

హీరోగా ఛాన్సులు తగ్గడంతో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చిన నవదీప్ ప్రస్తుతం న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ తో మనముందుకు రాబోతున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై నిర్మాణం జరుపుకున్న న్యూసెస్ వెబ్ సిరీస్ లో నవదీప్ తో పాటు బిందుమాధవి నటించింది. ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ను లాంఛ్ చేశారు. హైదరాబాద్ లోని ఆర్కే సినీ ప్లెక్స్ లో న్యూసెన్స్ ట్రైలర్ లాంఛ్ జరగగా నవదీప్ ను జర్నలిస్టులు కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్లు వేశారు.

మీడియా అంటే ఎందుకంత కోపమని అడగగా...మీడియా అంటే తనకు ఎలాంటి కోపం లేదని తనపై తప్పుడు వార్తలు వచ్చినప్పుడు మాత్రమే ఖండించానంటూ నవదీప్ చెప్పుకొచ్చాడు. డ్రగ్స్ కేసులో తన పేరు వినిపించడం పై కూడా నవదీప్ క్లారిటీ ఇచ్చాడు. తనకు ఫుడ్ అండ్ బెవరేజెస్ బిజినెస్ ఉండడంతోనే డ్రగ్స్ కేసులో తన పేరు వినిపించిందని చెప్పాడు. ఇక 2005లో మీ వల్ల ఒక హీరోయిన్ ఆత్మహత్యకు ప్రయత్నించింది కదా అని అడగగా..దానికి నవదీప్ ఎలాంటి అసహనం వ్యక్తం చేయకుండా వివరణ ఇచ్చాడు. అందులో ఎలాంటి నిజం లేదని పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశాడు.

అలాగే తాను ఏ రేవ్ పార్టీ నిర్వహించలేదని..ఇందుకు తన అమ్మేగారే సాక్ష్యమని చెప్పాడు. మొత్తానికి, నవదీప్ చుట్టూ ఎన్నో వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాలకు ఫుల్ స్టాప్ పడేలా నవదీప్ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు, కుర్రతనంలో కొన్ని తప్పులు చేశాను..కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయానంటూ ఈ వివాదాస్పద నటుడు తనపై ఉన్న అపవాదులను చెరిపే ప్రయత్నం చేసుకున్నాడు. సో, జర్నలిజం నేపథ్యంగా సాగే న్యూసెన్స్ వెబ్ సిరీస్ తో హిట్టు కొట్టి మళ్లీ లైమ్ లైట్ లో ఈ హీరో వెలిగిపోవాలని కోరుకుందాం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story