Natural Star Nani: విడుదలకి ముందే వంద కోట్ల బిజినెస్ చేసిన దసరా..

Natural Star Nani’s Dasara Did Rs 100 Cr Business
x

Natural Star Nani: విడుదలకి ముందే వంద కోట్ల బిజినెస్ చేసిన దసరా..

Highlights

Natural Star Nani: నాచురల్ స్టార్ "దసరా" సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

Natural Star Nani: నాచురల్ స్టార్ "దసరా" సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. అయితే ఈ సినిమా బడ్జెట్ రోజు రోజుకి పెరుగుతూ రావడం వల్ల సినిమా నిర్మాతలు ప్రాజెక్ట్ ని ఆపేసారని గతంలో పుకార్లు కూడా వినిపించాయి. కానీ చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి మాత్రం అందులో నిజం లేదని తన విరాటపర్వం, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఈ సినిమాని తానే స్వయంగా నిర్మిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

అయితే ఇక ఈ సినిమా పూర్తవడానికి దాదాపు 50 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చయిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొత్త డైరెక్టర్ అయినప్పటికీ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమా కోసం ఏకంగా 50 కోట్ల బడ్జెట్ ఖర్చు చేశారట. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఒక అదిరిపోయే ఓటీటీ ఆఫర్ వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 50 కోట్ల కంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చి మరి చిత్ర ఓటీటీ రైట్స్ ఆఫర్ రాగా మరొకవైపు మిగతా భాషల్లో సినిమా రైట్స్ 10 కోట్లకు అమ్ముడు అవ్వగా సాటిలైట్ రైట్స్ 20 కోట్లకు అమ్ముడయ్యాయి.

ఇలా సినిమా విడుదలకి ముందే 60 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది సినిమా. దసరా సినిమా ఎంతవరకు మంచి కలెక్షన్లు నమోదు చేసుకొని హిట్ అవుతుందో లేదో చూడాలి. మరోవైపు డిస్ట్రిబ్యూటర్లు సినిమాని 40 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా సినిమా విడుదల కి ముందే 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నాని కరియర్ లో అత్యధిక ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా దసరా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories