Natural Star Nani: టీవీ షో లకి గుడ్ బై చెబుతున్న నాచురల్ స్టార్

Natural Star Nani: * భవిష్యత్తులో కూడా టీవీ షోలను హోస్ట్ చేసే ఉద్దేశం ఏమాత్రం లేదని తేల్చి చెప్పాడు నాని

admin1
Updated on: 8 Oct 2021 6:05 PM IST
Natural Star Nani Says Goodbye to TV Shows | Telugu Cinema News
X
న్యాచురల్ స్టార్ నాని(ఫోటో-ది హన్స్ ఇండియా)

Natural Star Nani: దర్శకుడవుదామని ఇండస్ట్రీకి వచ్చిన నాని ఇప్పుడు హీరోగా సెటిలయ్యారు. న్యాచురల్ స్టార్ గా సూపర్ హిట్ సినిమాలను అందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మరోవైపు "హిట్" సినిమాతో నిర్మాతగా కూడా మారిన నాని బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరించి టీవీ ప్రేక్షకులను సైతం అలరించారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టీవీ షో లో పోస్ట్ గా వ్యవహరించడం ఇక తన వల్ల కాదని భవిష్యత్తులో కూడా టీవీ షోలను హోస్ట్ చేసే ఉద్దేశం ఏమాత్రం లేదని తేల్చి చెప్పాడు నాని. బిగ్బాస్ సీజన్ 2 కి పోస్టింగ్ వ్యవహరిస్తున్నప్పుడు నానిపై చాలానే ట్రోల్స్ వచ్చాయి.

అందుకే హర్ట్ అయిన నాని ఈ నిర్ణయానికి వచ్చారని కొందరు అభిమానులు చెబుతున్నారు. నిజానికి బిగ్బాస్ సీజన్ 2 తర్వాత నానికి చాలా టీవీ షో లో నుంచి ఆఫర్లు వచ్చాయట. కానీ నాని మాత్రం ఏవి ఒప్పుకోలేదు. కేవలం సినిమాల మీద మాత్రమే దృష్టి పెట్టారు. ఇకపై కూడా కేవలం సినిమా మీదే ఫోకస్ చేస్తానని అంటున్నారు నాని. ఇక నాని టీవీ షోల కి గుడ్ బై చెప్పేసినట్లే. సినిమాల పరంగా చూస్తే ఈ మధ్యనే నాని హీరోగా నటించిన "టక్ జగదీష్" సినిమా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓటీటీలలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. మరోవైపు నాని "అంటే సుందరానికి" మరియు "శ్యామ్ సింఘా రాయ్" సినిమాలతో బిజీగా ఉన్నారు.

admin1

admin1

Next Story