Vaishnav Tej : నాని వ‌ద్దన్నాడు..వైష్ణ‌వ్ చేస్తానంటున్నాడు..

Vaishnav Tej New Movie: తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు క‌థ‌నాయ‌కుల‌ను దృష్టిలో పెట్టుకుని స్టోరీలు సిద్ధం చేసేవారు.

Venkata Chari
Published on: 27 Feb 2021 11:23 AM IST
Natural Star Nanis Rejected Story Goes To Mega Hero Vaishnav TeJ
X
నాని అండ్ వైష్ణవ్ తేజ్ (ఫోటో ట్విట్టర్ )

Vaishnav Tej New Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు క‌థ‌నాయ‌కుల‌ను దృష్టిలో పెట్టుకుని స్టోరీలు సిద్ధం చేసేవారు. ఒకవేళ సదరు హీరోకు ఆ కథ నచ్చకపోతే అది పక్కకు పడేసేవారు. వేరే జానర్‌ చిత్రాలు చేయాలంటే వెనకంజ వేసేవారు హీరోలు. అభిమానులు తమను అలాంటి చిత్రాల్లో ఓకే చేస్తారో లేదో.. అని గమ్మునుండేవారు. ప్రయోగాల జోలికి అస్సలు వెళ్లేవారు కాదు. కానీ ప్రస్తుతం ట్రెండ్‌ మారింది. జానర్‌తో సంబంధం లేకుండా హీరోలు సినిమాలు ఓకే చేస్తున్నారు. కథ కొత్తగా ఉంటే చాలు అంటున్నారు.

అలాగే ప్రస్తుతం ఓ హీరో స్లోరిని రిజెక్ట్‌ చేస్తే దాన్ని.. పక్కన పడేయడం లేదు. మరో హీరోకు ఆ స్టోరిని వినిపించి, సినిమాను పట్టాలెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ఇదే జరిగింది టాలీవుడ్‌లో. నాచురల్‌ స్టార్‌ నాని వద్దన్న ఓ కథను హీరో వైష్ణవ్‌ తేజ్‌ ఓకే చేశాడంట. ఇక వివరాల్లోకి వెళ్తే... తాజాగా నిర్మాత భోగవల్లి ప్రసాద్‌ నూతన డైరెక్టర్‌తో యాక్షన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారట. అయితే ఈ చిత్రానికి తొలుత నానిని హీరోగా అనుకున్నారట. ఏమైందో కాని, హీరో నాని ఈ కథను రిజెక్ట్‌ చేశాడట. దాంతో ఈ స్టోరిని ఉప్పెన హీరో వైష్ణవ్‌ తేజ్‌కు వినిపించారట సదరు దర్శకుడు. వైష్ణవ్ ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించాడని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.

కాగా, ప్రస్తుతం ఉప్పెన సక్సెస్‌తో మంచి ఫామ్‌లో ఉన్న వైష్ణవ్‌ వరుసగా సినిమాలు ఓకే చేస్తున్నాడు. ఇప్పటికే డైరెక్టర్‌ క్రిష్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'జంగిల్‌ బుక్' ‌సినిమాను పూర్తి చేశాడు. అనంతరం అన్నపూర్ణ బ్యానర్‌లో ఓ చిత్రం.. దాని తర్వాత భోగవల్లి ప్రసాద్‌ బ్యానర్‌లో తెరకెక్కించే చిత్రాల్లో నటించనున్నాడు. అయితే నాచురల్ స్టార్ వదులుకున్న ఈ చిత్రం మెగా హీరోకి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

Venkata Chari

Venkata Chari

Next Story