Nani: శ్రీకారం వద్దనుకున్న నాని..?

Natural Star Nani Rejected Sreekaram movie
x

నాచురల్ స్టార్ నాని (ఫైల్ ఫొటో)

Highlights

Nani: నాచురల్ స్టార్ నాని "టక్ జగదీష్‌", "అంటే సుందరానికి", "శ్యామ్ సింగ రాయ్" సినిమాలతో బిజీగా ఉన్నారు.

Nani: నాచురల్ స్టార్ నాని త్వరలో విడుదల కానున్న "టక్ జగదీష్‌"తో బిజీగా ఉన్నారు. ఇదే కాకుండా మరో రెండు సినిమాలు "అంటే సుందరానికి", "శ్యామ్ సింగ రాయ్" లతో కూడా బిజీగా ఉన్నారు. ఈ ఫుల్ షెడ్యూల్ తో బిజీగా ఉన్నప్పడు కోత్త దర్శకుడు కిషోర్ ఓ స్ర్కిప్ట్ తో నాని వద్దకు వెళ్లాడంట. అయితే నాని ఆ ప్రాజెక్టును తిరస్కరించాడంట. దీంతో డైరెక్టర్ కిషోర్ మరో యంగ్ హీరో శర్వానంద్‌ను సంప్రదించాడంట. శర్వానంగ్ ఓకే చేయడంతో శ్రీకారం సినిమాగా కార్యరూపం దాల్చింది.

మహాశివరాత్రి రోజున విడుదలైన "శ్రీకారం" సినిమా హిట్ టాక్ తో మంచి కలక్షన్స్ రాబడుతోంది. అయితే నాని ఈ సినిమాని తిరస్కరించడానికి కారణంపై ఒక విషయం హల్ చల్ చేస్తుంది. శ్రీకారం సినిమా మహేష్ బాబు "మహర్షి" చిత్రాన్ని పోలి ఉండడంతో నాని ఈ చిత్రాన్ని వద్దనుకున్నాడని టాక్. మరో రూమర్ ప్రకారం నాని ఈ చిత్రానికి డేట్స్ సర్దబాటు కాకే తిరస్కరించాడని తెలుస్తోంది. కారణం ఏమైనా, ఈ చిత్రం ఇప్పుడు విజయం సాధించింది.

శ్రీకారం సక్సెస్‌తో శర్వానంద్ ఫామ్‌లోకి వచ్చాడని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇదే ఫామ్ లో ముందుకు సాగాలని కోరుకుందాం.

Show Full Article
Print Article
Next Story
More Stories