ఫిల్మ్ ఛాంబర్‌ జాయింట్‌ సెక్రటరీ పదవికి నట్టి కుమార్‌ రాజీనామా

తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ జాయింట్‌ సెక్రటరీ పదవికి నిర్మాత నట్టి కుమార్‌ రాజీనామా చేశారు. అలాగే ఎగ్జిక్యూటీవ్ కమిటీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. చిన్న నిర్మాతల సినిమాలను రిలీజ్ చేయకుండా కొందరు అడ్డుకుంటున్నారని విమర్శించారు

admin
Published on: 12 Dec 2020 12:33 PM IST
ఫిల్మ్ ఛాంబర్‌ జాయింట్‌ సెక్రటరీ పదవికి నట్టి కుమార్‌ రాజీనామా
X

తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ జాయింట్‌ సెక్రటరీ పదవికి నిర్మాత నట్టి కుమార్‌ రాజీనామా చేశారు. అలాగే ఎగ్జిక్యూటీవ్ కమిటీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. చిన్న నిర్మాతల సినిమాలను రిలీజ్ చేయకుండా కొందరు అడ్డుకుంటున్నారని విమర్శించారు. దీనికి నిరసనగానే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. థియేటర్లు ఓపెన్ అవ్వడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో థియేటర్ల ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లపై ఆధారపడ్డ కూలీలు ఎంతో సంతోషించారని, కానీ కొందరు నిర్మాతల వలన వారు తీవ్ర నిరాశకు గుర్యయ్యరని వెల్లడించారు. తమ స్వప్రయోజనాల కోసం థియేటర్లను 2021 మార్చి వరకు మూసి ఉంచేలా చూస్తున్నారని తెలిపారు.దీనిపైన వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ నారాయణదాసు, సెక్రటరీ దాములను కోరారు నట్టి కుమార్.

admin

admin

Next Story