సూపర్ హిట్ సినిమా అసలు బాలేదు అంటున్న టెక్నీషియన్

సూపర్ హిట్ సినిమా అసలు బాలేదు అంటున్న టెక్నీషియన్
x
Highlights

ఎక్స్పెరిమెంటల్ చిత్రాల విషయానికి వస్తే అలాంటి సినిమాలు అందరికీ ఒక పట్టాన నచ్చవు. కానీ సూపర్ హిట్ అయిన చిత్రాలు మాత్రం దాదాపుగా అందరికీ అందరికీ నచ్చే...

ఎక్స్పెరిమెంటల్ చిత్రాల విషయానికి వస్తే అలాంటి సినిమాలు అందరికీ ఒక పట్టాన నచ్చవు. కానీ సూపర్ హిట్ అయిన చిత్రాలు మాత్రం దాదాపుగా అందరికీ అందరికీ నచ్చే తీరుతాయి. ఒకవేళ నచ్చకపోయినా సినిమా బాలేదు అని చెప్పే వాళ్లు చాలామందే ఉంటారు. కానీ సినీ ఇండస్ట్రీకి చెందిన వారే స్వయంగా సినిమా చాలా చెత్తగా ఉంది అని చెబితే ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే పరిస్థితి 'సూపర్ డీలక్స్' సినిమాకు వచ్చింది. త్యాగరాజన్ కుమార్ రాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, సమంత, ఫహాద్ ఫాజిల్, రమ్యకృష్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఒకవైపు ఈ సినిమా సూపర్ అంటూ ప్రేక్షకులు కామెంట్లు చేస్తుంటే, మరొకవైపు 'అ ఆ' సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సినిమాటోగ్రాఫర్ కం నటుడు నటరాజన్ సుబ్రమణియన్ తన ట్విట్టర్ ద్వారా ఈ సినిమా అస్సలు బాగోలేదు అని చెప్పారు. "బాధ, అసహ్యకరమైన విషయాలు.. వీటిని చూసి ఎవరైనా ఎలా ఆనందించగలరు? అలాంటి వాటిని ఎలా మెచ్చుకోగలరు? నేను అయితే ఇలాంటి సినిమాలకు దూరంగా ఉంటాను. 'సూపర్ డీలక్స్' సినిమా అస్సలు భరించలేం" అంటూ ట్వీట్ చేసారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఆయన పై ఫైర్ అవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories