Balakrishna: బిగ్ బాస్ కంటెస్టెంట్ తో నందమూరి బాలకృష్ణ

* బాలకృష్ణ "అన్స్టాపబుల్" కోసం నటరాజ్ మాస్టర్

admin1
Updated on: 25 Oct 2021 3:45 PM IST
Nataraj Master Worked as Choreographer for Balakrishna Unstoppable Show Introduction Song
X

బిగ్ బాస్ కంటెస్టెంట్ తో నందమూరి బాలకృష్ణ(ఫైల్ ఫోటో)

Balakrishna - Natraj Master: సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పుడు "అన్స్టాపబుల్" షోతో హోస్ట్ అవతారం లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ షో ఆహా వీడియో లో టెలికాస్ట్ కానుంది. తాజాగా ఈ షో కి సంబంధించిన ఒక ఈవెంట్ హైదరాబాద్లో జరిపారు దర్శకనిర్మాతలు. తాజా సమాచారం ప్రకారం ఈ షో ఇంట్రడక్షన్ సాంగ్ లో బాలకృష్ణ వేసిన డాన్స్ కి బిగ్ బాస్ ఫేమ్ నటరాజ్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారట.

నటరాజ్ మాస్టర్ మరియు బాలకృష్ణ కలిపి కలిసి ఉన్న ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. బిగ్ బాస్ హౌస్ లో నాలుగు వారాలు ఉన్న నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాక కూడా మంచి ఆఫర్లే అందుకుంటున్నాడు అని అభిమానులు కూడా సంతోషిస్తున్నారు.

మరోవైపు బాలకృష్ణ ను హోస్ట్ అవతారంలో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమాల పరంగా బాలకృష్ణ త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో "అఖండ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రగ్య జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

admin1

admin1

Next Story