సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్.. కారణం అదేనా..?

సినిమాలకి వీడ్కోలు చెప్పిన నాజర్
*సినిమాలకి వీడ్కోలు చెప్పిన నాజర్
Nasser Retirement: దక్షిణాది ప్రేక్షకులలో ప్రముఖ నటుడు నాజర్ గురించి తెలియని వారు ఉండరు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం హిందీ భాషల్లో నటుడిగా ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. దాదాపు అందరూ స్టార్ హీరోల సినిమాలలో ముఖ్య పాత్రలు పోషించిన నాజర్ ఈమధ్య సినిమాలు బాగా తగ్గించేశారు. తాజాగా నాజర్ కి సంబంధించిన ఒక వార్త తమిళ్ ఇండస్ట్రీలో అభిమానులకి షాకిస్తోంది.
నాజర్ సినిమాలకి గుడ్ బై చెప్పబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. యాక్టింగ్ కి రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకుంటున్నట్లుగా నాజర్ నిర్ణయించుకున్నారు అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.ఇక వివరాల్లోకి వెళితే ఆరోగ్య సమస్యల వల్ల నాజర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ సమయంలో నాజర్ గుండె సంబంధిత సమస్యలతో బాధ పడ్డ సంగతి తెలిసిందే.
అప్పటి నుంచి కొన్ని సినిమాల్లో మాత్రమే కనిపించిన నాజర్ ఇప్పుడు పూర్తిగా సినిమాలకి వీడ్కోలు చెప్పబోతున్నారని తెలుస్తోంది."నాకు తెలిసినంతవరకు నేను చివరి దశలో ఉన్నాను. సినిమాపై ఆసక్తి ఉంది కానీ నా వయసు సహకరించాలి కదా. భవిష్యత్తులో ఒకవేళ నటించినా కూడా చాలా సెలెక్టివ్ రోల్స్ ని ఎంచుకుంటాను" అని నాజర్ రెండేళ్ల క్రితమే చెప్పారు. ఏదేమైనా నాజర్ వంటి విలక్షణ నటుడు ఇకపై సినిమాలలో కనిపించరు అని అభిమానులు నిరాశ చెందుతున్నారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMT
PM Kisan: రైతులకి అలర్ట్.. మరో 20 రోజుల్లో 12వ విడత డబ్బులు..!
12 Aug 2022 11:30 AM GMTHealth Tips: తొందరగా అలసిపోతున్నారా.. ఈ జ్యూస్లని డైట్లో...
12 Aug 2022 10:30 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్...
12 Aug 2022 9:55 AM GMTCM Jagan: అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్.. స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక...
12 Aug 2022 9:43 AM GMTMacherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం మూవీ రివ్యూ..
12 Aug 2022 9:29 AM GMT