Naresh: రమ్యరఘుపతి కేసులో వివరణ ఇచ్చిన సినీ నటుడు నరేష్

Naresh: 9ఏళ్ల క్రితం ఆమెతో పెళ్లయ్యింది.. 3ఏళ్ల క్రితమే మేము ఇద్దరం విడిపోయాము

Rama Rao
Updated on: 23 Feb 2022 12:13 PM IST
Naresh Gave an Explanation in the Ramya Raghupathi Case | Telugu Online News
X

రమ్యరఘుపతి కేసులో వివరణ ఇచ్చిన సినీ నటుడు నరేష్

Naresh: సీనియర్ నటుడు నరేష్ తనకు మాజీ భర్త కానీ ఆయన ఆస్తులన్నీ తనకు చెందుతాయని చెప్పి నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసి మోసం చేయడంతో ఆమె పై ఐదుగురు మహిళలు హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నరేష్ ఆస్తులు తనకు చెందుతాయని, హిందూపూర్, అనంతపూర్, హైదరాబాద్ లో కొంతమంది ఆడవాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసి వారిని మోసం చేసిందట రమ్య. అందులోనుంచి ఒక ఐదుగురు మహిళలు ఇప్పుడు ఈమె పై కేసు నమోదు చేశారు.

అయితే ఈ డబ్బు విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు సీనియర్ నటుడు నరేష్. నరేష్ కి రమ్య మూడవ భార్య. ఎనిమిదేళ్ల క్రితమే రమ్యను వివాహం చేసుకున్న నరేష్ ఆమెతో విడిపోయారు. నరేష్ నుంచి విడిపోయిన తరువాత రమ్య నరేష్ ఆస్తులను చూపిస్తూ అధిక వడ్డీ పేరుతో మరియు రిజిస్ట్రేషన్ ల పేరుతో కోట్ల రూపాయల మోసాలు చేయడానికి పాల్పడింది. ఇలా చాలా మంది మహిళల నుంచి డబ్బులు తీసుకున్న ఈమెపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమెతో కానీ ఆమె చేసే పనులతో కానీ అతను తనకు ఎటువంటి సంబంధం లేదని నరేష్ చేతులెత్తేశారు.

Rama Rao

Rama Rao

Next Story