Narappa Movie Update: అమెజాన్ ప్రైమ్ లో "నారప్ప"

Narappa Movie: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తమిళ రీమేక్ "నారప్ప" చిత్రం

Sandeep Reddy
Published on: 11 July 2021 2:49 PM IST
Narappa Movie Release in Amazon Prime OTT
X

నారప్ప పోస్టర్(ట్విట్టర్ ఫోటో)

Narappa Movie: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తమిళ రీమేక్ "నారప్ప" చిత్రం అతి త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయన్నున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి "నారప్ప" చిత్రాన్ని జూలై 26న విడుదల చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటన వీడియో విడుదల చేసింది. కరోనా కారణంగా విడుదలకి ఆలస్యం అయిన ఈ చిత్రం అటు సినిమా థియేటర్స్ లో విడుదల చేయాలా లేదా ఓటీటీలో విడుదల చేయాలా అనే సందిగ్ధంలో ఉన్న చిత్ర యూనిట్ తాజాగా ఓటీటీ లో విడుదల చేయడానికి ఆసక్తి చూపింది. తెలంగాణాలో పూర్తి స్థాయిలో సినిమా థియేటర్స్ ఓపెన్ చేయడానికి అనుమతి ఇచ్చిన ఆంధ్ర ప్రదేశ్ లో 50 శాతం కెపాసిటీ తో థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చని అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే

అయితే రానున్న రోజుల్లో కరోనా మహమ్మారి ఏ స్థాయిలో ఉండనుందో అని ఆలోచించి ఓటీటీ నుండి మంచి ఆఫర్ రావడంతో నారప్ప ను ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి చూసుకునే విధంగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నారు. ఆదివారం ఈ సినిమాకి సంబంధించిన "చలాకి చిన్నమ్మి" ఫస్ట్ లిరికల్ పాటని ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. తమిళంలో ధనుష్ నటించిన "అసురన్" చిత్రాన్ని తెలుగులో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మణిశర్మ సంగీతంతో సురేష్ బాబు, కలైపులి నిర్మాతలుగా "నారప్ప" చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటించింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story