Narappa Movie: ఓటీటీలో 'నారప్ప' విడుదల కానుందా..?

Narappa Movie: విక్టరీ వెంకటేష్ హీరోగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ''నారప్ప''.

Venkata Chari
Updated on: 27 April 2021 11:03 AM IST
Narappa Movie Release Date 2021 in OTT Platform
X
నారప్పలో వెంకటేష్ (ఫొటో ట్విట్టర్)

Narappa Movie: విక్టరీ వెంకటేష్ హీరోగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ''నారప్ప''. వి క్రియేషన్స్ కలైపులి ఎస్.థాను సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ సూపర్ హిట్ 'అసురన్' చిత్రానికి తెలుగు రీమేక్ 'నారప్ప'.

ఈ చిత్రాన్ని మే14న థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు సినిమా యూనిట్ ఇంతకముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో అనేక సినిమాలు విడుదల తేదీలను వాయిదా వేసుకుంటున్నాయి. నారప్ప సినిమా కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపించింది. ఈ మేరకు ఉగాది రోజు విడుదల చేసిన పోస్టర్ లోనూ రిలీజ్ డేట్ ప్రకటించలేదు. దీంతో 'నారప్ప' డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

గతేడాది కూడా కరోనా టైంలో చాలా సినిమాలు థియేటర్‌లో విడుదల కాలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఓటీటీలోనే విడుదల చేయాల్సి వచ్చింది. అనంతరం లాక్‌డౌన్ తీసేశాక మళ్లీ థియేటర్స్ లో విడుదల చేశారు. అయితే ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ తో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో మరలా లాక్ డౌన్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదే జరిగితే మరలా థియేటర్లు కొంత కాలం మూతపడనున్నాయి.

ఈ నేపథ్యంలో సినిమాలు ఓటీటీ బాట పట్టే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. దీంతో వెంకటేశ్ 'నారప్ప' సినిమా కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుందంటున్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ విషయమై అధికారికంగా అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ ఆల్రేడీ అమెజాన్ లోనే స్ట్రీమింగ్ అవుతోంది. 'నారప్ప' విడుదలపై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Venkata Chari

Venkata Chari

Next Story