"బాణం" డైరెక్టర్ తో సినిమా సైన్ చేసిన నారా రోహిత్

Nara Rohit: పాత డైరెక్టర్ తోనే సినిమా ఓకే చేసిన నారా రోహిత్

Jyothi
Updated on: 13 Feb 2023 7:00 AM IST
Nara Rohit has Signed a Film with the Director of Banam
X

"బాణం" డైరెక్టర్ తో సినిమా సైన్ చేసిన నారా రోహిత్

Nara Rohit: నారా చంద్రబాబు నాయుడు తమ్ముడి తనయుడి గా ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని ఏర్పరుచుకున్నారు. "బాణం" సినిమాతో హీరోగా మారిన నారా రోహిత్ "సోలో" సినిమా తో మంచి హిట్ అందుకున్నాడు. ప్రతినిధి, రౌడీ ఫెలో, అసుర వంటి ఎక్స్పరిమెంట్ సినిమా లు చేయడం లో కూడా ముందే ఉండే నారా రోహిత్ మినిమం గ్యారంటీ హీరో గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే వరుస డిజాస్టర్ ల వల్ల ఒక్కసారిగా నారా రోహిత్ మార్కెట్ బాగా దెబ్బతింది.

జ్యో అచ్యుతానంద, అప్పట్లో ఒకడుండేవాడు, శమంతకమణి వంటి సినిమాలు పర్వాలేదనిపించినా అవి మల్టీ స్టారర్ సినిమాలే కాబట్టి రోహిత్ కు ఫుల్ క్రెడిట్ దక్కలేదు. తాజాగా ఇప్పుడు నారా రోహిత్ కొత్త సినిమాలు ఏమి ఒప్పుకోకుండా సినీ కెరీర్ నుండి చిన్న బ్రేక్ తీసుకున్నారు. ఈమధ్యనే చైతన్య దంతులూరి దర్శకత్వంలో "అనగనగా దక్షిణాది" అనే సినిమాని ప్రకటించారు కానీ అది ఆగిపోయింది. "శబ్దం" అనే మరో సినిమా కూడా ప్రకటన వచ్చింది కానీ పట్టలెక్కలేదు.

తాజాగా ఇప్పుడు నారా రోహిత్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యారట. మంచి కంటెంట్ ఉన్న సినిమా లతో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చెయ్యాలి అని అనుకున్నారు. తాజా సమాచారం ప్రకారం "బాణం" సినిమా దర్శకుడుతో నారా రోహిత్ మరొక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొత్త కథతో సినిమా తెరకెక్కిస్తున్నారా లేక ఆగిపోయిన సినిమానే మళ్లీ పెట్టాలెక్కిస్తున్నారా అని ఇంకా తెలియాల్సి ఉంది.

Jyothi

Jyothi

Next Story